క‌రోనా మొద‌టి వేవ్ ప్రారంభ‌మైన సంద‌ర్భంలో పొలం ప‌నుల‌లో నిత్యం బిజీగా ఉండే ఓ యువ రైతుకు వ‌చ్చిన వినూత్న‌ ఆలోచ‌న ఈ అంద‌మైన రెండంత‌స్తుల మంచెకు రూపునిచ్చింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండ‌లం సిర్‌పూర్ గ్రామానికి చెందిన బొడ్డు గోపాల్ 30 ఏండ్ల యువ రైతు. ఆ ఊరి చివ‌ర‌కు గుట్ట‌కు అనుకొని ఉన్న త‌న రెండెక‌రాల వ్య‌వ‌సాయ భూమిలో వ‌రిని సాగుచేస్తూ అక్క‌డే ఎక్కువ కాలం గ‌డుపుతాడు.

క‌రోనా మొద‌టి వేవ్ స‌మ‌యంలో లాక్‌డౌన్ విధించిన నేప‌థ్యం అత‌నికి ఈ కొత్త ఆలోచ‌న స్పురించే లా చేసింది. వెంట‌నే ఆ ప‌క్క‌నే పొలానికి అనుకొని ఉన్న గుట్ట‌కు వెళ్లి రోజు క‌ట్టెలు కొట్టి తెచ్చుకుని ఈ మంచెను స్వ‌యం గా ఒక్క‌డే నిర్మించుకున్నాడు. ఇప్ప‌డు నిత్యం ఇత‌ని నివాసం ఎక్కువ స‌మ‌యం ఇక్క‌డే.  పొలం ప‌నులు చేసి అల‌సిపోయి న ప్ర‌తి సంద‌ర్భంలో అమ్మ ఒడిలా సేద‌తీర్చేది ఇదే. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు ఈ ప్ర‌కృతి ఒడిలో ఆ మంచె మురిపంలో ఆ యువ‌రైతు త‌న‌కు తాను సేద తీర‌డ‌మే కాకుండా చాలా మంది నిజామాబాద్ వాసుల‌కు కూడా ఈ ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదించేందుకు అవ‌కాశం క‌ల్పించాడు.

You missed