నిజామాబాద్ నగర బీజేపీ కార్పొరేటర్ భర్త ఆకుల శ్రీనివాస్ ఓ డాక్టర్‌ను రెండో పెళ్లి చేసుకునే నిమిత్తం ఆ మహిళను ఇంట్లో నుంచి తీసుకువెళ్లడంతో వివాదం రేగింది. ఆ మహిళ తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం రచ్చకెక్కింది. జిల్లా రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. కాగా ఆగ్రనేతలు, జిల్లా నేతలు వెంటనే రంగంలోకి దిగారు. దిద్దుబాటు చర్యలో భాగంగా ఆ అమ్మాయిని పోలీసుల వద్దకు పంపి కాంప్రమైజ్ చేయించారు. తన ఇష్టపూర్వకంగానే ఆకుల శ్రీనివాస్‌తో వెళ్లినట్లు నాల్గోటౌన్ ఎస్సై సందీప్‌కు వివరణ ఇచ్చింది. దీంతో కేసు పోలీసులు విత్‌డ్రా చేసుకున్నారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. జరగాల్సిన డ్యామేజీ అప్పటికే పార్టీకి జరిగింది. ఆకుల శ్రీనివాస్ పై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికి సదరు మహిళ ఆకుల శ్రీనివాస్‌ను పెళ్లి చేసుకుంటానని అనడం గమనార్హం. ఆకుల శ్రీనివాస్ సైతం ఆ డాక్టర్ని రెండో పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చున్నాడు. దీంతో కార్పొరేటర్ ఇంట్లో కలహాల కాపురం మొదలైంది. ఈ వ్యవహరం మీడియాలో రచ్చకెక్కడంతో శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకత్వం డిమాండ్ చేస్తున్నది. మరోవైపు టీఆరెఎస్ సోషల్ మీడియాలో ఈ వివాదాన్ని మరింత వైరల్ చేస్తూ రాజకీయంగా వాడుకుంటున్నది.
