కేసీఆర్ పై ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర‌ళి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశాడు. త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డాడు. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యులో లోతుగా, సూటిగా త‌న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కేసీఆర్‌ను ఓ అస‌మ‌ర్ధుడిగా ఆయ‌న అభివ‌ర్ణించాడు. ద‌ళిత బంధు ప‌థ‌కం త‌న అవ‌స‌రం కోసం సృష్టించుకున్న‌ద‌ని అన్నాడు. కేసీఆర్‌కు ద‌ళితుల పై చిన్న చూపు ఉంద‌ని, దాన్ని ఆయ‌న క‌ప్పిపెట్టి ఎస్సీలంతా దూర‌మ‌య్యార‌నే కార‌ణంతో ఓట్ల కోసం ద‌ళిత బంధు ప్ర‌వేశ పెట్ట‌డాని అన్నాడు. ఎన్న‌డూ లేనిది ఏడేండ్ల త‌ర్వాత ద‌ళితులు గుర్తొచ్చారా? అబ‌ద్ధాలు చెప్ప‌డంలో కేసీఆర్ ఒక స్పెష‌లిస్ట్ అని అన్నాడు. ఆయ‌న మాట్లాడిన ప్ర‌తీ మాట వెనుక ఒక లోతైన అధ్యాయ‌నం క‌నిపించింది. ప‌నిగ‌ట్టుకొని అబాసు పాలు చేయాల‌నే ఉద్ధేశం లేదు. కేసీఆర్ మాన‌స‌త్వాన్ని చాలా ద‌గ్గ‌ర చూసిన మ‌నిషిగా ఆయ‌న మాట్లాడాడు. ఇది క‌చ్చితంగా దొర‌గారి పాల‌న విధానంగానే ఉన్న‌ద‌ని అన్నాడు. క‌లెక్ట‌ర్ల‌కు కూడా తెలంగాణ‌లో స్వేచ్ఛ లేద‌ని, సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌ను ఎలా వినియోంచుకోవాలో కేసీఆర్‌కు తెలియ‌ద‌ని అన్నాడు. త‌న కులం మ‌నుషుల‌ను వెతికి వెతికి ప‌ట్టుకువ‌చ్చి ఉన్న‌త ప‌ద‌వుల్లో కుర్చోబెట్ట‌డం బాగా తెలుస‌న్నాడు.

– దేశంలోని 28 రాష్ట్రాల్లో విద్య‌లో తెలంగాణ 18వ స్థానంలో ఉంది. 8వేల కోట్లు జీతాల‌కు వెచ్చిస్తున్నారు. కానీ స‌ర్కారు బ‌డుల్లో వ‌చ్చే ఉత్తీర్ణ‌త శాతం 63. సీ గ్రేడ్‌. ప్ర‌భుత్వం ఒక విద్యార్థి పై 40 వేలు ఖ‌ర్చు చేస్తుండ‌గా.. ప్రైవేట్ విద్యా సంస్థ‌లు 7వేలు ఖ‌ర్చు చేస్తున్నాయి. కానీ ప్రైవేట్‌లో వ‌చ్చేది మాత్రం A గ్రేడ్‌.

– ప్ర‌భుత్వ విద్యా వ్య‌వ‌స్థ మీద ఈ ఏడేండ్ల కాలంలో ఒక్క నిమిషామైనా కేసీఆర్ స‌మీక్ష జ‌రిపాడా?

– వీసీ పోస్టులు ఖాళీ ఉంచాల్సిన అవ‌స‌రం ఆయ‌న‌కేమొచ్చింది? వీసీలుగా చేసేందుకు మీకు ఎవ‌రూ క‌నిపించ‌లేదా?

– రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల‌ను యాభ‌యో వందో ఏర్పాటు చేసి విద్య‌ను సంస్క‌రించామ‌ని చెబుతున్నాడు. వీటి ద్వారా ఓ 5 శాతం మందికి మాత్ర‌మే విద్య ల‌భిస్తోంది. మ‌రీ మిగిలిన 95 శాతం మంది మాటేమిటీ?

– 2004 బ్యాచ్‌కు చెందిన 8 మంది ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ అధికారుల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా అవ‌మానించిన మాట వాస్త‌వం కాదా?

– బీసీ, ఓసీ ఐఏఎస్ అధికారులు అవినీతి చేసినా మీకు క‌నిపించ‌దు? ఎస్సీలు మాత్రం ప‌క్కా అవినీతి ప‌రులు మీ దృష్టిలో.

– ద‌ళిత బంధు పేరుతో నువ్వు ఆడుతుంది ఓ రాజ‌కీయ క్రీడా. ఎస్సీ, ఎస్టీ స‌బ్‌ప్లాన్ నిధుల విష‌యంలో లెక్క‌ల‌న్నీ అంకెల గారెడే. ద‌ళిత బంధు కింద 11,900 మందికి ల‌బ్ధి జ‌రుగుతుంద‌ని చెబుతున్నావు. వాస్త‌వంగా జ‌నాభా ప్ర‌తిపాదిక‌న 16వేల కోట్లు ఈ ప‌థ‌కానికి అవ‌స‌రం ప‌డ్తాయి.

– ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో లంచం లేనిదే ప‌ని జ‌ర‌గ‌డం లేదు.. కాదంటారా?

– పోలీస్ స్టేష‌న్ మెట్లెక్కాలంటేనే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డ్తున్నారు. వాస్త‌వం కాదా?

– అన్ని పోలీస్ స్టేష‌న్ల‌ల‌లో సీసీ కెమెరాలు అమ‌ర్చాలి. సుప్రీం కోర్టు ఆదేశించింది కూడా. ఎన్ని స్టేష‌న్ల‌ల‌లో ఉన్న‌యో చెబుతారా?

– మిష‌న్ భ‌గీర‌థ నీరు 55 శాతం జ‌నాభాకు మాత్ర‌మే అందుతున్న‌ది. కాదంటారా?

– ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ ప్ర‌భుత్వాలు విద్యా, వైద్య రంగాల పై చూపుతున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను, ప‌థ‌కాల ప్లానింగ్‌ను నువ్వు కాపీ కొట్ట‌ల‌నుకుంటున్నావు నిజం కాదా?

– ఎస్సీల ప‌ట్ల నీకు అస‌హ్యం.. నిర్ధ‌య ఉంది. అది నేను గ్ర‌హించాను.

– కాళేశ్వ‌రం ద్వారా 20ల‌క్ష‌ల ఎక‌రాల‌కు కూడా నీరు పార‌డం లేదు. దాన్ని కేసీఆర్ రెట్టింపు చేసి చెబుతున్నాడు.

– ప్ర‌పంచంలోనే త‌న‌పేరు గొప్ప‌గా వెలిగిపోవాల‌నే త‌ప‌న‌తో, కీర్తి కండూతితో ఆయ‌నే ఒక ఇంజ‌నీరు. ఆయ‌న ఒక ఐఏఎస్ అధికారి. ఆయ‌నే అన్నీ. ఇదేలా సాధ్యం?

– క్యాబినెట్‌లో 1శాతం జ‌నాభా ఉన్న వెలమ‌లు 22శాతంగా ప‌ద‌వులు అనుభ‌విస్తున్నారు. 3శాతంగా ఉన్న
రెడ్లు 36 శాతం ప‌ద‌వులు అనుభ‌విస్తున్నారు. కానీ ఎస్సీల‌కు మాత్రం జ‌నాభా ప్ర‌తిపాదిక‌న మంత్రి ప‌ద‌వులు ఉండ‌వు.

 

You missed