కాదేదీ ప్రచారానికి అనర్హం… ఎంతకైనా సరే… ఎందాకైనా సరే..!! ప్రజాస్వామ్యం అపహాస్యమైపోయినా ఓకే… గెలిచేందుకు జనం మనసు గెలిచే ప్రయత్నం చేయండి… ఏమార్చే ప్రయత్నం కాదు…
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం కొంత పుంతలు తొక్కుతున్నది. సోషల్ మీడియా దీనికి తోడుగా నిలుస్తున్నది. గ్రాఫిక్స్, మార్ఫింగ్స్.. తమకు నచ్చినట్టు…తోచినట్టు, జుగుప్సాకరంగా, వెటకారంగా, వెక్కిరింతగా… చిలిపిగా, చీపుగా… ఎలాగైనా ప్రచారం చేసుకోవచ్చు. ఆంక్షలు లేవు. పట్టింపు లేదు. పట్టించుకునే వాళ్లూ…