పదెకరాలకు కటాఫ్ పెడితే బాగుండె…! వ్యవసాయయోగ్యం అంటూ మళ్లీ ఫైరవీలకు బాటలు.. లంచాలకు దారులు..! సాగు నిర్దారణ అధికారులపై ఇక నేతల ఒత్తిళ్లు.. రాష్ట్రంలో 90 శాతం వరకు పదెకరాల లోపున్నవారే..! అప్పుడు కేసీఆర్… ఇప్పుడు రేవంత్ తప్పుడునిర్ణయాల పథకం… రైతుభరోసా కూడా రైతుబంధులా సర్కార్‌ను బద్నాం చేసే పథకమేనా..?
(దండుగుల శ్రీనివాస్) కొండంత రాగం తీసి.. చివరకు సీఎం రేవంత్ కూడా కేసీఆర్ బాటలోనే సాగాడు. అప్పుడు కేసీఆర్ రైతుబంధును పక్కా ఓటుబ్యాంకు పథకంగా మార్చాడు. వందల ఎకరాల బడా భూస్వాములకూ ఇచ్చాడు. ఎందుకని అడిగితే.. ఏదో రెండువేల ఎకరాలే ఎక్కవవుతున్నాయి..…