మంత్రిగానే కాదు మీ శీనన్నగా తోడుంటా..! రెవెన్యూ ఉద్యోగులకు పొంగులేటి భరోసా.. !! కీలక భేటీలో రెవెన్యూ ఉద్యోగల సేవలను ప్రశంసించిన మంత్రి.. మీరు మంచిగా పనిచేస్తేనే మాకు మంచిపేరొస్తుంది…! సమస్యలన్నీ పరిష్కరిస్తా.. డోంట్‌వర్రీ… ! అభయం ఇచ్చిన మంత్రి పొంగులేటి నాలుగ్గంటల పాటు ఓపిగ్గా రెవెన్యూ ఉద్యోగులతో ముచ్చటించిన శ్రీనివాస్‌రెడ్డి.. గత ప్రభుత్వం పట్టించుకోలేదు.. ఈ సర్కార్ గుర్తించింది… సంతోషం..! రెవెన్యూ ఉద్యోగుల ఫీలింగ్..
(దండుగుల శ్రీనివాస్ ) కేసీఆర్ ఆది నుంచి రెవెన్యూ ఉద్యోగులను చిన్నచూపు చూశాడు. వారిని పలుచన చేస్తూ పలుమార్లు మాట్లాడాడు. వారిపై నిందారోపణలు కూడా చేశాడు. తహసీల్దార్లంటేనే జనాలను పీల్చుకుతినే జలగలు అనే విధంగా మాజీ సీఎం కేసీఆర్ తీరు ఉండేది.…