మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం ఎమ్మెల్యే షకీల్ అలక… ఇస్తారా..? ఇయ్యరా..? నేనంటే పట్టి లేదా..? నా మాట పట్టించుకోరా..?? నర్సింగ్ రావు కోసం పట్టు… కులమే అడ్డుగా మారిన వైనం….
బోధన్ ఎమ్మెల్యే షకీల్ మళ్లీ అలకపాన్పెక్కాడు. అతనికి ఇది అలవాటుగా కూడా మారింది. తనను అధిష్ఠానం పట్టించుకోవడం లేదని పలుమార్లు ఆయన అలకవహించారు. నియోజకవర్గానికి రాకుండా దూర దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆ యన పెట్టిన ప్రపోజల్‌ను అధిష్టానం తిరస్కరించింది.…