రేవంత్ పంచ్…! పాంచ్ పటాకా..!! చేసింది కొంతే.. చేయాల్సింది ఎంతో…!! హుందాగా అంగీకరించిన సీఎం…! ప్రభుత్వ ఉద్యోగాల కల్పన విషయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం..! 9న తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పై జనామోదం…. తనదైన మార్కు పాలన ఉంటుందనే సంకేతం…! నేను తలుచుకుంటే కేసీఆర్, కేటీఆర్ జైలుపాలే… కానీ నాకు ప్రజలు ముఖ్యం.. వీరి గురించి పట్టించుకోను…! సిద్దిపేట వేదికగా తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన సీఎం రేవంత్… స్పీచ్‌లో హుందాతనం… పాత వాసనలు , భాషణలకు దూరం..!!
(దండుగుల శ్రీనివాస్) ఏడాది తరువాత సీఎంగా రేవంత్ హుందాగా సిద్దిపేట బహిరంగ సభలో తన విశ్వరూపాన్ని చూపాడు. మారిన మనిషినిగా మాట్లాడాడు. ప్రాక్టికల్ గా ప్రసంగించి పబ్లిక్‌ను ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు సాగిన బహిరంగ సభలు ఒకెత్తు.. ఇవాళ్టి సభ ఒకెత్తు…