నిత్యం తాగొచ్చి నానా రభస చేస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్న కన్న కొడుకును తండ్రి కత్తితో తలపై దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌లో జరిగింది. పనిపాటా లేకుండా జులాయిగా తిరుగుతున్న కొడుకు చాలా ఏళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. పెండ్లి చేస్తేనన్న దారిలోకి వస్తాడేమోనని తండ్రి రెండేళ్ల క్రితం వివాహం జరిపించాడు. కానీ కొడుకు ప్రవీణ్ మారలేదు. మరింత జులాయిగా మారాడు. నిన్న రాత్రి కూడా తాగొచ్చి తండ్రితో గొడవకు దిగాడు. ఇక భరించలేని ఆ తండ్రి ఓపిక నశించి ఇంట్లో ఉన్న కత్తితో తలపై దాడి చేయగా.. రమేశ్ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి చనిపోయాడు. తండ్రి ఏలుగం రమేశ్ పై కేసు నమోదు చేశారు. టౌన్ సీఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు. పూర్తి వివరాలు రాబడుతున్నారు.