కేసీఆర్ అంతే. ఏ సంద‌ర్భాన్నైనా త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటాడు. ఎదుటివాళ్లు దానికి సై అనాల్సిందే. లేక‌పోతే వాళ్ల క‌ర్మ‌. త‌న ప్ర‌యోజ‌నాలు త‌న‌కుంటాయి. అందుక‌నుగుణంగా నిర్ణ‌యాలు మారుతుంటాయి. ఆలోచ‌న‌లు జ‌రుగుతూ ఉంటాయి. మొన్న‌టికి మొన్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎమ్మెల్యే కోటా లో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హిద్దామా? అని అడిగితే.. వ‌ద్దొద్దు.. ఇంకా క‌రోనా పోలేదు. ఈ స‌మ‌యంలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేమ‌ని చెప్పించాడు. అలా చెప్పించ‌డానికి కార‌ణం హుజురాబాద్ మ‌రింత లేట‌యితే బాగుండు అనే ఆలోచ‌నే అని అంద‌రికీ తెలుసు. ఇప్పుడు ద‌ళిత‌బంధు పథ‌కాన్ని హుజురాబాద్‌లో పైల‌ట్ ప్రాజెక్టుగా అమ‌లు చేసేందుకు ఈనెల 16న ముహూర్తం ఖ‌రారు చేశాడు. ఇదంతా ఆశామాషీగా చేస్తే ఎలా? పొలిటిక‌ల్ మైలేజీ రావాలె క‌దా. అందుకే ల‌క్ష మందితో ఇక్క‌డ స‌భ నిర్వ‌హిస్తాడ‌ట‌. దీని కోసం కొంత మంది టీఆరెస్ నేత‌లు వెళ్లి గ్రౌండు,, ఏర్పాట్లు ప‌రిశీలించి కూడా వ‌చ్చార‌ట‌. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ద‌ళితుల‌ను ఇక్క‌డికి దింపి నానా హంగామా చేస్తార‌న్న‌మాట‌. ఆ త‌ర్వాత టీఆరెస్ అభ్య‌ర్థిని ఇక్క‌డే ప్ర‌క‌టిస్తాడ‌ట‌. స‌రే మీ ఇష్టం.. మీ పార్టీ, మీ అభ్య‌ర్థి. ఎప్పుడైనా ఎక్క‌డైనా ప్ర‌క‌టించుకోండి. కానీ ఈ ల‌క్ష మంది ఎందుకు సారు? అస‌లే క‌రోనా కాలం. మీ కోసం అంద‌రినీ ఆడికి పిలిచి ఇబ్బంది పెట్టుడెందుకు?

త‌ప్ప‌దంటారా? ల‌క్ష‌మందితో పెట్టాల్సిందేనా? స‌రే మ‌రి. మీ మాటే ఫైన‌ల్ క‌దా. ఎవ‌రు కాదంటారు. ఎవ‌రి చావు వాళ్లు చ‌స్తారు.

You missed