కేసీఆర్ ఛేదించిన భయంకరమైన కుట్ర

@@@

అప్పటికే నాలుగైదు రోజులుగా మంతనాలు సాగుతున్నాయి. ఈ మంతనాల్లో కీలకపాత్ర తిరుపతికి చెందిన సింహయాజులు స్వామిది. ఆయనకు ఢిల్లీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయి. లోకల్ గా అనేకమంది బీజేపీ, టీఆరెస్, కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో పూజలు, యాగాలు చేయిస్తుంటాడు. రాజకీయంగా పలుకుబడి ఉంది.

టీఆరెస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో కూడా ఆయన యాగాలు చేయిస్తుంటాడు. ఆయనకు ఢిల్లీ పెద్దల నుంచి మంచి అఫర్ వచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డితో మాట్లాడి నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలోకి తెస్తే ఒక్కొక్కరికి యాభై కోట్ల వంతున ఇస్తామని డీల్ ఇచ్చారు. ఆ బాధ్యతను నెత్తిన వేసుకున్న సింహయాజులు పైలట్ తో మాట్లాడటం, ఆయన సరే అని చెప్పడంతో మిషన్ సక్సెస్ అనుకున్నారు సింహయాజులు.

అప్పుడు బ్రోకర్ కమ్ హోటల్ ఓనర్ నందకుమార్ రంగంలోకి దిగారు. ఢిల్లీలోని పెద్దలతో సంప్రదించి రామచంద్రభారతి స్వామిని పంపేట్లు చేశారు. ఆయన హైదరాబాద్ లో దిగిన తరువాత అడ్వాన్స్ పదిహేను కోట్లు సిద్ధం చేశారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలను తన ఫార్మ్ హౌస్ కు పిలుస్తానని, ఇద్దరు స్వాములను, బ్రోకర్ ను అక్కడకి రమ్మని చెప్పారు రోహిత్ రెడ్డి.

నిన్న సాయంత్రం మూడోకంటికి తెలియకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమాచారం చేరవేశారు ఆయన. కేసీఆర్ వెంటనే పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. వెంటవెంటనే కొందరు పోలీసులు స్విగ్గి డెలివరి బాయ్స్ వేషాల్లో ఫార్మ్ హౌస్ చుట్టుముట్టు కాపు కాశారు. ఈలోగా రెండు టీవీ ఛానెల్స్ కు సమాచారం అందజేశారు ప్రగతిభవన్ అధికారులు.

ఆరుగంటల ప్రాంతంలో ఇద్దరు స్వాములు, బ్రోకర్ ఫార్మ్ హౌస్ కు వెళ్లారు. అక్కడ అందరూ కూర్చుని మాట్లాడుకుంటుండగా అకస్మాత్తుగా పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు స్వాములు, బ్రోకర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

ముగ్గురికీ సంకెళ్లు పడ్డాయి. తమకు అందిన సమాచారం, దాన్ని బట్టి తాము నిందితులను పట్టుకున్న విధానం గూర్చి పోలీస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సాయంత్రం ముగ్గురినీ కోర్టులో హాజరు పరుస్తున్నారు పోలీసులు.

నేరుగా కేసీఆర్ ను ఎదుర్కునే దమ్ము లేని బీజేపీ ఈ విధంగా వందలకోట్లు వెచ్చించి ఇతరపార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యడమే. మనదేశంలో ఫిరాయింపులు అనేవి జరుగుతుంటాయి. అవి స్వచ్ఛందంగా జరుగుతుంటాయి తప్ప కొనుగోలు ద్వారా కాదు.

ముందు తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలను కూల్చాలని పధకం వేశామని స్వాములు చెప్పడం విశేషం. ఆ మూడు రాష్ట్రాల తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కూల్చే పధకం ఉన్నదని వారు చెప్పారట.

ఇంతవరకు కమలం తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేసింది. ఇటీవల మహారాష్ట్రలో ఆపరేషన్ సక్సెస్ అయింది. బీహార్ లో ఫెయిల్ అయింది. అయితే అది పోలీసులవరకు వెళ్ళలేదు. తెలంగాణలో మాత్రం ఆపరేషన్ ఫెయిల్ అయింది.

నిందితులు అందరూ బీజేపీ అగ్రనేతలకు అతి సన్నిహితులు అని ఫొటోలే చెబుతున్నాయి. వారితో మాకు ఎలాంటి సంబంధమూ లేదని కిషన్ రెడ్డి లాంటి నాయకులు చెప్పడం సిగ్గుచేటు. సెలెబ్రటీలతో మనం తీయించుకునే ఫోటోలను బట్టి మనం వారికి సన్నిహితులమా లేక అపరిచితులమా అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. అదేమీ బ్రహ్మవిద్య కాదు.

నలుగురు టీఆరెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోకుండా కేసీఆర్ పట్ల తమ నిబద్ధతను, అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ సమయస్ఫూర్తితో బీజేపీ పన్నాగాలు చెదిరిపోయాయి.

తెలంగాణాలో కేసీఆర్ ఉన్నంతవరకు ఇలాంటి ప్రజాస్వామ్య విఘాతాలకు ఆస్కారం లేదు. తెలంగాణాలో పార్టీలు వేర్వేరు కాచ్చు. కానీ మనందరిది ఒకే తెలంగాణ అనే ఆత్మీయ భావన మెండుగా ఉన్నది. కౌరవులు, పాండవులు విడివిడిగా నూరుగురు,అయిదుగురు కావచ్చు. కానీ పరాయివాడు మనమీద పెత్తనం చేస్తామంటే మనం నూటఅయిదు మందిమి అని ధర్మరాజు అంటాడు. తెలంగాణ ప్రజలది కూడా అదే సామరస్యం. ఆ సమైక్యత అందరిని కలిపి ఉంచుతుంది. అది లోపించిననాడు మళ్ళీ రాష్ట్రం ముక్కలు అవుతుంది. లేదా పరాయివాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. అరవై ఏళ్ళ పోరాటఫలితంగా చివరకు కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. అలాంటి నాయకుడిమీద కుట్రలు చేస్తే జనం భరించే పరిస్థితి ఇక్కడ లేదు. అందుకే ఇక్కడ జాతీయపార్టీల ఆటలు సాగవు.

 

ముర‌ళీమోహ‌న రావు ఇల‌పావులూరి

You missed