మునుగోడు ఉప ఎన్నిక ఏమోగానీ టీఆరెస్ నేతలకు దీపావళి లేకుండా చేసింది. తమకు ఈ ఎన్నిక ఇన్చార్జిగా ప్రకటించడంతో అక్కడి నుంచి కాలు బయట పెట్టలేని స్థితిలో ఉన్నారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ఇంకా ఎక్కువ సమయం లేదు. కేసీఆరే దీనిపై సీరియస్‌గా నజర్ పెట్టి ఒక్కొక్కర్నీ పార్టీలోకి లాగుతున్నాడు. బీజేపీకి దిమ్మదిరిగేలా ఘర్‌వాపసీ విజయవంతంగా నడుస్తోంది. పనిలో పని ఇతర నేతలకూ ప్రగతి భవన్ నుంచి పిలుపు వస్తోంది. కేసీఆర్ పిలవడమే తరువాయి ఆ పక్షులు అలా వెళ్లి చెంతన వాలిపోయి పులకించిపోతున్నాయి.
గెలుపు తీరాలకు చేరుతాం అని ధీమా ఉన్నా… చివరి వరకూ ఓ భయంతోనే ఉండనున్నారు టీఆరెస్ నేతలు. ఎవరికిచ్చిన ఇన్చార్జి కేటగిరీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి…? ఎంత పోలయ్యాయి..? దాని ఇన్చార్జి పనితనం ఏపాటిది..? పోలింగ్ తర్వాత రిజల్టు వీరి భవిష్యత్తునూ తేల్చనుంది. దీంతో పండుగ కూడా కాలు బయటపెట్టలేదు. మెసేజ్‌ల రూపంలో తమ కార్యక్తరలకు, నాయకులు శుభాకాంక్షలు..అంతే..! ఇంట్లో వాళ్లకూ అర్థమయ్యిపోయింది. ఈ ఉప ఎన్నిక ముగిసే సరికి ఆ నాయకుడు ఇంటిపట్టున ఉండడు. పట్టుమని పది నిమిషాలు మాట్లాడడని. అంతలా కష్టపడుతున్నారు టీఆరెస్ నేతలు.
ఈసారి అందరి నేతలూ మునుగోడు ప్రజలతో దీపావళి జరుపుకుంటారన్న మాట. రిజల్టు మాత్రం ఎవరికి దీపావళి వెలుగులు విరజిమ్ముతాయో..? ఎవరి ముడ్డి కింద సుతిలీ బాంబు పెడతాయో తెలవదు. అంత ఉత్కంఠైతే ఉంది అందరిలో..