అందమైన నగరం… అందనమైన గోడలు. ఆకట్టుకనే రోడ్డు డివైడర్లు. ఆ మధ్యలో చెట్లు.. ఆహ్లాదంగా కనిపించే రోడ్డు కిరువైపులు. కనువిందు చేసే హైమాస్ట్ లైట్ల జిలుగులు.. అది నిజామాబాద్ నగరం…
అంతా బాగానే ఉంది. కానీ ఈ మధ్య ఈ గోడలకు రంగు పడింది. జిల్లా అధ్యక్షుడుగా టీఆరెస్ పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని నియమించింది. ఎడాపెడా ఆయన గోడలపై రాతలు రాయించేశాడు. కేసీఆర్ జిందాబాద్…. జీవన్‌రెడ్డి జిల్లా అధ్యక్షుడు. ఎన్నికల వేళ గోడలపై రాసే రాతలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్న ఇవి రోడ్డుపై వెళ్లే వారి కళ్లకు కొట్టొచ్చిన్నట్టు …ఎబ్బెట్టుగా కనిపించాయి. ఏమనుకున్నారో… గానీ మొత్తానికి నిజామాబాద్ మున్సిపల్ అధికారులు ధైర్యం చేశారు. ఆ రాతపై రంగేశారు. తెలుపు రంగుతో నీట్ గా చేశారు. జిల్లా అధ్యక్షుడైతే మాకేంటీ..? అనే రీతిలో తమ పని తాము చేసుకుపోయారు. ఇప్పుడక్కడ ఎబ్బెట్టు రంగులు లేవు… తెలుపు రంగు దాన్నిచెరిపేసింది.