కుళ్లిన రాజకీయాలకు దూరంగా…నిజాయితీగా రాజకీయాలు చేసిన ఆయన పేదల గుండెల్లో చిరకాలం ఉంటారు. ఆలూరు గంగారెడ్డి భాయ్ సాబ్ మీకు జోహార్లు…💐💐🙏🙏💐
– యాటకర్ల మల్లేష్, సీనియర్ జర్నలిస్ట్
————————————–
ఆలూర్ గంగారెడ్డి…
ఊరును మారు పేరుగా పెట్టుకొని తనదైన శైలిలో ప్రజాప్రతినిధిగా అడుగులు వేసి ప్రజల హృదయాలలో నిలిచిన మహానుభావుడు…
పొలిటికల్ లీడర్ గా గంగారెడ్డి జర్నలిస్ట్ గా నేను
ఇద్దరి మధ్య సంబంధం
ఇరవై ఏళ్లకు పైననే..
అప్పుడప్పుడు ఇంటికి ఆహ్వానించి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలు ఇంకా
నా మదిలో మెదులుతూనే ఉన్నాయి.
కుళ్లిన రాజకీయాలకు అతీతంగా
కల్మషం లేని గంగారెడ్డి నిజాలను నిర్భయంగా మాట్లాడేవారు..
ఆ మహానుభావుడు
ఎవరి మెప్పు కోసమో
ఎప్పుడు ఆత్మ గౌరవంను తగ్గించుకోలేదు..
సర్పంచ్ గా..
కో ఆపరేటివ్ చైర్మన్ గా.. డిసిసిబి డైరెక్టర్ గా
ఇలా ఎన్నో పదవులు చేపట్టినా..
ఎప్పుడు ప్రేమతోనే పలుకరించి
మంచి చేడులలో పెద్దన్నలా
తోడుండే వారు…
TDP నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన గంగారెడ్డి స్వల్ప ఓట్లతో
ఓడిపోయారు..
ఎమ్మెల్యే కావాలనే కల ఈ TRS ప్రభుత్వంలో కలగానే మిగిలిపోయింది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం TDP కి
గుడ్ బై చెప్పి..
TRS జిల్లా అధ్యక్షులుగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ముందుకు తీసుకెళ్లారు….
తెలంగాణ రాష్ట్ర సాధనలో నిర్విరామంగా కృషి చేసిన ఆలూరు గంగారెడ్డి
ప్రత్యేక రాష్ట్రంలో
KCR అన్యాయం చేశాడని పొలిటికల్ జర్నీకి బై చెప్పి ప్రజల మధ్య జీవిస్తున్నారు.
ఆలూరు గంగా రెడ్డి ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోవడం కష్టమే..
అయినా..
కుళ్లిన రాజకీయాలకు దూరంగా
నిజాయితీగా రాజకీయాలు చేసిన ఆలూర్ గంగారెడ్డి పేదల గుండెల్లో ఉంటారు.
ఆలూరు గంగారెడ్డి భాయ్ సాబ్
మీకు జోహార్లు…
💐💐💐💐💐🙏🙏🙏💐💐💐