కేంద్రం పేద‌ల‌కు ఇచ్చే బియ్యంలో త‌మ వాటా గురించి కేంద్ర మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ అబ‌ద్దాలాడార‌ని అన్న‌.. హ‌రీశ్‌రావు.. కేంద్రానికి ఆదాయం స‌మ‌కూర్చి న‌డిపే రాష్ట్రాల‌లోతెలంగాణ కూడా ఉంద‌ని, మీరు కేసీఆర్ ఫోటో పెట్టుకోండ‌ని అన‌డం హ‌రీశ్ స్థాయికి సూట‌య్యే వ్యాఖ్య‌లు కావు. ఈ మాట‌ల‌కు కేసీఆర్ మెచ్చుకుంటాడేమో గానీ, జ‌నాలెవ్వ‌రూ హ‌ర్షించ‌రు. రేష‌న్ షాపుల్లో మోడీ ఫోటో పెట్టుకోవాల‌ని సూచించిన నిర్మ‌ల మాట‌ల‌ను దిగ‌జారుడుగా వ‌ర్ణించిన హ‌రీశ్… త‌ను అదే తోవ‌లో న‌డిచాడు. అవే మాట‌లు మాట్లాడాడు. కేంద్రం న‌డిచేందుకు త‌మ నిధులే వినియోగించుకుంటున్నార‌ని అన‌డం వ‌ర‌కు ఓకే గానీ, కేసీఆర్ ఫోటో పెట్టుకోండ‌ని అన‌డం మాత్రం త‌న స్థాయిని త‌గ్గించుకోవ‌డ‌మే అవుతుంది.

అబ‌ద్దాల మంత్రుల లిస్టులో నిర్మ‌ల సీతారామ‌న్ కూడా చేరిపోయార‌ని, గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర భారీగా పెంచామ‌ని గ‌ల్లీల‌కు వెళ్లి చెప్పుకోవాల‌ని అన్న హ‌రీశ్‌… కేంద్ర లోపాలను ఎత్తి చూప‌లేక‌పోయాడు. కేవ‌లం కొన్ని ప్ర‌క‌ట‌నల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. మోడీ ఫోటో పెట్టాల‌న్న నిర్మ‌ల మాట‌ల‌కే ఆయ‌న ప్రెస్‌మీట్ పెట్టి కౌంట‌ర్ ఇచ్చిన‌ట్టున్నాడు. అదీ బూమ‌రాంగ్ అయ్యింది .. కేసీఆర్ ఫోటో మీరూ పెట్టుకోవాల‌ని చెప్ప‌డంతో….

You missed