మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏదో ఒక వివాదంలో కూరుకుపోతున్నాడు. ఆయన వ్యవహార శైలి, వైఖరి కొత్త కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నది. ఆ సామాజిక వర్గానికే అతన్ని దూరం చేస్తున్నది. గౌడ్ల అండతో మంత్రివై వారినే పట్టించుకోవడం లేదనే విమర్శలు సేమ్ సామాజికవర్గం నుంచి ఎదుర్కుంటున్నాడు. మొన్న స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో గాలిలో కాల్పులు జరిపి వివాదానికి తెరలేపిన మంత్రి … తాజాగా పాపన్న జయంతి ఉత్సవాల్లో చరిత్ర పరిశోధకుడు, పాపన్న పుస్తక రచయిత కొంపల్లి వెంకట్ గౌడ్‌ను కార్యక్రమానికి మంత్రి పిలవలేదని భగ్గుమంటున్నారు.
కేసీఆర్ ప్రభుత్వానిదీ తప్పిదంగా చూపుతున్నారు. శ్రీనివాస్ గౌడ్‌కు చరిత్ర తెల్వదంటూ దునుమాడుతున్నారు. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి దీనిపైనే చర్చ, రచ్చ సాగుతున్నది. రచయితకు మద్దతుగా నిలిస్తూ మంత్రి వైఖరిని ఎండగడుతున్నారు చాలా మంది.