నిజామాబాద్:

ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆలూరు,డొంకేశ్వర్ మండలాలు, బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సాలూర మండలం మొత్తం నిజామాబాద్ జిల్లాలో కొత్తగా మూడు మండలాలు,కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో కొత్తగా డొంగ్లి మండలం ఏర్పాటు చేయడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగా,ఆ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల మంత్రి వేముల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

You missed