ఎక్కడో వానొస్తే.. నువ్వు అప్రమత్తం అవుతావు.
ఏదో పిడుగుపాటుకు.. నువ్వు ఉలిక్కి పడతావు.
లోకం ఆపద నీ ఆపద అనుకుంటావు.
జనాల కష్టం నీ కష్టంగా ఫీలవుతావు.
నువ్వో ప్రజాప్రతినిధివి కావు.. అధికారివి కావు.. పోలీసువీ కావు.!
ఐనా చొరవ తీసుకుంటావ్.. చొచ్చుకొని వెళ్తావ్.
బ్రేకింగ్ వార్తలు ఇచ్చే నీ జీవితానీకంటూ ఓ బ్రేకింగ్ ఉండదు.
కుటుంబాన్ని.. ఆరోగ్యాన్నీ పట్టించుకోకుండా పడి పడి ఉరుకుతావు.
ఇప్పట్లా ఏదో వరదొస్తే.. ప్రమాదమొస్తే తెల్లారేలోగా నువ్వో విషాద వార్తయిపోతావ్.!
జోహార్ జర్నలిస్ట్ జమీర్..💐

Daayi Sreeshailam

You missed