“పిలగాడేం చేస్తడే.?”

“విలేకరి పని. మీదంగ బాగనే దొర్కుతయి.”

“ఇంకేంది.. మంచిదేనాయె.. బుజ్జమ్మా ఏమంటవ్రా నచ్చిండా.?”

“ఆ.. బాబాయ్..”

“బుజ్జమ్మ కూడా మెచ్చింది.. ఐతే లగ్గం పెట్టుకునుడేగా.?”

“బాబాయ్….”

“ఏందిరా బుజ్జమ్మా.. ఏమన్న మాట్లాడ్తవా.?”

“ఆ ఏంలే బాబాయ్.. విలేకరి అంటే తిరుగుడెక్వుంటది కదా.. అసలే రేట్లు అడ్డగోలుగా పెంచిండ్రు. సంపాదించిందంతా పిట్రోల్కే ఐతదేమో అనిపిస్తుందే…….”

“ఏ.. కూసోర్రి కూసోర్రి బావా. గా పొల్లకేం తెల్సు.. మేం మాట్లాడ్తంగానీ కూసోర్రి..”

Daayi Sreeshailam