కేసిఆర్ లేకుంటే తెలంగాణ ను యుపి.బీహార్ లా మారుస్తరు
పచ్చబడ్డ తెలంగాణను ఆగం చేస్తరు
కేసిఆర్ మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష
ఆయనకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత మనందరిది
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ:
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం బాల్కొండ, బోదేపల్లి, జలాల్ పూర్,కిసాన్ నగర్ గ్రామాలకు చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 500 మంది ముఖ్య నాయకులు,కార్యకర్తలు,యువకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బుధవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు
అంతకుముందు టిఆర్ఎస్ శ్రేణులు బాల్కొండ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో మంత్రికి ఘన స్వాగతం పలికారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్:
ముఖ్యమంత్రి కేసిఆర్ గారి జనరంజక పాలనకు ఆకర్షితులై ఇంత పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీలో చేరడం సంతోషం
ఇవాళ్టి నుంచి మీరు నా కుటుంబ సభ్యులు.
మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు.
మనల్ని నమ్ముకున్న కార్యకర్తల్ని విస్మరించకూడదు.మనం ఉన్న పార్టీ పట్ల, నాయకునికి విధేయతతో ఉండాలని…
బాల్కొండ నియోజకవర్గంలో కమిట్మెంట్ ఉన్న నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
కేసిఆర్ ఏదైనా పిలుపిస్తే వెంటనే పాటించే నిఖార్సైన కార్యకర్తలు నియోజకవర్గంలో ఉన్నారు.
నా వ్యక్తిగత కుటుంబం చాలా చిన్నది.కానీ మీ అందరితో కలిపి నా కుటుంబం చాలా పెద్దది.
దేశంలోనే తెలంగాణ అభివృద్ధి లో నెంబర్ వన్.
ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కరెంట్ కోతలు ఉన్నాయి.
తెలంగాణలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం
గతంలో రైతు ట్రాన్స్ఫార్మర్,కరెంట్ కోసం అధికారుల చుట్టూ తిరిగారు
గతంలో తాగు,సాగు నీటి గోస ఉండేది.ఇప్పుడు ఉన్నదా..?
కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీల్లు ఇస్తున్నారని కొనియాడారు.
దేశంలో ఎక్కడా ఇట్లా లేదని అన్నారు.
ఇక్కడి బీజేపీ నాయకులు మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు.
నేడు సాగునీటి గోస లేదు.
ఎండా కాలంలో కూడా బాల్కొండ చెరువులు నిండు కుండల ఉన్నాయిగుత్పా లిఫ్ట్, జాలాల్ పూర్ లిఫ్ట్ లతో ఆయా చెరువులు నింపుకున్నాం
300 కి.మి కింద ఉన్న కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కాకతీయ,వరద కాలువలు నిండుగా ఉన్నాయి.
బాల్కొండ, చిట్టాపుర్,శ్రీరాంపూర్ గ్రామాలకు 50 కోట్లతో లిఫ్ట్ ఏర్పాటు చేయబోతున్నాం
వారం పది రోజుల్లో శంకుస్థాపన..
100 కోట్లతో కప్పల వాగు,పెద్దవాగు మీద చెక్ ద్యాములు నిర్మించాం
వందల కోట్లతో లిఫ్టులు ఏర్పాటు చేసుకుంటున్నాం.
1350 కోట్లతో ప్యాకేజీ 21 ద్వారా త్వరలో సాగు నీటిని అందించబోతున్నం
బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో
రైతు బంధు,రైతు భీమా,ఇంటింటికీ నల్లా నీరు,కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్,ఆసరా పెన్షన్ ఎందుకు లేవు.ఏనిమిదెళ్ళలో కేసిఆర్ చేసిన అభివృద్ది నరేంద్ర మోడీ ఎందుకు చేయలేదు.
బాల్కొండ ఊరికి ఏమీ చేసారో చెప్పాలి.నేను ఊరిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిన.మీరు కూడా ఏర్పాటు చేయండి వేరే మండలాల్లో…
అభివృద్దిలో పోటీ పడదాం దమ్ముంటే..
జై శ్రీరామ్ అని మాటలు చెప్పుడు కాదు..నేను కేసిఆర్ ను ఒప్పించి 53 గుడులు కట్టించిన..నీవు ఎన్ని కట్టించావు అరవింద్.
ఆసరా పెన్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 8వేల కోట్లు ఖర్చు చేస్తుంది.కేంద్రం ఇచ్చేది కేవలం 200 కోట్ల రూపాయల మాత్రమే..
తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా…
హౌసింగ్ శాఖ మంత్రి గా నా సవాల్..
డబుల్ బెడ్రూం ఇళ్లకు ఒక్కో ఇంటికి 5 లక్షల 4వేలు ఖర్చు చేస్తున్నాం. స్థలం కర్చు అదనం..
మోడీ ఇచ్చేది 72వేలు..అవి కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలే..
వైకుంఠదామం,డంపింగ్ యార్డు,సి.సి రోడ్లు,ఇంటికి నల్లా నీరు,ట్రాక్టర్,మొక్కల పెంపకం,..అన్నింటికీ పైసలు మోడీ ఇస్తున్నడు అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని 10ఆదర్శ గ్రామాల లెక్క తీస్తే తెలంగాణ రాష్ట్రానివే 10 గ్రామాలు.
మీ పైసలే అయితే.. మీ పాలిత 18 రాష్ట్రాల్లో ఆదర్శ గ్రామాలు ఎందుకు లేవు.
అన్ని జూట మాటలు…ఇక నుంచి నిలదీయాలి.
ఇష్టం వచ్చినట్లు కుక్కల్లగా మొరిగే వాళ్లకు గట్టిగానే సమాధానం చెప్పాలి.
మీ బీజేపీ రాష్ట్రాల్లో చూపించి ఇక్కడ మాట్లాడు అని గల్లా పట్టి అడగాలి.
సోషల్ మీడియా లో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు.అన్ని తిప్పికొట్టాలి.
కేసిఆర్ ఉప్పుడు ఉపవాసం ఉండి రాష్ట్రాన్ని సాధించారు.తెలంగాణ ఇవ్వకుంటే అన్నం తినను అని మొండిగా నిలబడ్డాడు.
తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ వన్ చేశారు.
కేసిఆర్ లేకుంటే తెలంగాణ మరో బీహార్, యూపి అవుతుంది.
పచ్చ బడుతున్న తెలంగాణ ఆగం అవుతుంది
దాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత మనదే.
యెన్నటికైన కేసిఆర్ మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష…