లే అవుట్ డెవ‌ల‌ప‌ర్ల‌కు మ‌ళ్లీ షాక్ త‌గిలింది. హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమ‌తి లేకుండా ప్లాట్లు విక్ర‌యించ‌రాద‌ని ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేర‌కు రిజిస్ట్రేష‌న్ శాఖ‌కు ఇవాళ ఉత్త‌ర్వులు అందాయి. గ‌తంలో గ్రామ పంచాయ‌తీల అనుమ‌తిలో లే అవుట్ చేసి ప్లాట్లు అమ్ముకున్నారు డెవ‌ల‌ప‌ర్లు. ఇవ‌న్నీ ఇల్లీగ‌ల్ కింద‌కు వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వం ఎల్ ఆర్ ఎస్ ప్ర‌వేశ‌పెట్టింది. దీనిపై ప్ర‌జ‌ల నుంచి ప్ర‌భుత్వం తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఎంత వ్య‌తిరేక‌త అంటే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆరెస్ ఘోరా ప‌రాభ‌వానికి ఇది ప్ర‌ధాన కార‌ణ‌మైంది. దీంతో ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది. అనుమ‌తి లేని ప్లాట్లు కొన్న ప్ర‌జ‌ల‌కు వెసులుబాటు క‌ల్పించింది. ఆ ప్లాట్ల‌కు రిజిస్ట్రేష‌న్ చేయించుకునే వెసులుబాలు క‌ల్పించింది.

కానీ అప్ప‌టి వ‌ర‌కు అమ్ముడుపోకుండా డెవ‌లప‌ర్ల వ‌ద్దే ఉన్న అనుమ‌తి లేని ప్లాట్ల‌కు మాత్రం లే అవుట్ రెగ్యులేష‌న్ చేయించుకోవాల్సిందేన‌ని తేల్చి చెప్పంది. అయితే దీనిపై డెవ‌ల‌ప‌ర్లు హై కోర్టును ఆశ్ర‌యించారు. అమ్ముడుపోకుండా ఉన్న ప్లాట్ల‌కు కూడా రిజిస్ట్రేష‌న్ చేయించేలా అనుమ‌తి ఇవ్వాల‌ని కోర్టును ఆశ్ర‌యించ‌డంతో కోర్టు కూడా డెవ‌ల‌ప‌ర్ల‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ ప్ర‌భుత్వం మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఈ తీర్పుపై సుప్రీం ను ఆశ్ర‌యించింది. సుప్రీం దీనిపై స్టే విధించింది. ఇవాళ ప్రభుత్వం నుంచి రిజిస్ట్రేష‌న్ శాఖకు ఉత్తర్వులు అందాయి. అనుమ‌తి లేకుండా ఉన్న ప్లాట్ల‌ను రిజిస్ట్రేష‌న్ చేయ‌వ‌ద్ద‌ని అందులో పేర్కొన్న‌ది. దీంతో డెవ‌ల‌ప‌ర్ల‌కు మ‌ళ్లీ షాక్ త‌గిలింది. ఇక క‌చ్చితంగా వీరు హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమ‌తి తీసుకోవాల్సింది. దీని ద్వారా ప్ర‌భుత్వానికి భారీగా ఆదాయం స‌మ‌కూర‌నుంది.