బ్రతకనివ్వండిరా! బ్రతకనివ్వండిరా!
ఇష్టమొచ్చినోడితో బ్రతకనివ్వండిరా!
అంటే ఎవడు విని సచ్చాడు?
అందుకే ఇలా సర్‌ప్రైజ్ గిఫ్ట్!

గొంతుకోస్తే మర్యాదైనా దక్కుతుంది.
బలవంతంగా పడగ్గదికి పంపివుంటే?
“ష్!”
సమాధానం త్వరలోనే వస్తుంది,
వార్తలు చూస్తూండండి! ఇకపై చెల్లవు!

శబ్బాశ్ బిడ్డా! నీ శరీరం నీది.
ఈ నీతిలేని మనుషులంతా, శరీరం మీద, బ్రతుకుమీద పెళ్ళిపేరుతో చేసే అఘాయిత్యం మీద, కుత్తుకలు కోయాలసిందే.
ముందు చేయివేయడానికి వచ్చినోడిని, ఆనక తలుపులేసి వ్యభిచారం చేయించే తల్లిదండ్రితో సహా, బంధువులందరినీ.

(ఫోటో చూపడం నాకిష్టంలేదు, కానీ ఈబిడ్డని తప్పుపడుతూ తప్పుడు వెధవలు రాస్తూ ఫోటో షేర్ చేస్తున్నప్పుడు, దాన్ని కౌంటర్ చేయడానికి షేర్ చేస్తున్నా!

Siddarthi Subhash Chandrabose

ఆ అమ్మాయి గొంతు కోసిన ఘ‌ట‌న‌పై అంత‌టా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. వెట‌కారాలు కారాలు మిరియాలు నూరాయి. అత‌డు త‌న గొంతు కోసినా.. ఆమె ఏమైనా చేసుకుంటుందేమోన‌ని భ‌య‌ప‌డి త‌నే బైక్‌పై ఇంటి దాకా దిగ‌బెట్టాన‌నే మ‌రో వార్త కూడా చ‌ర్చ‌కు తెర తీసింది. దీనిపైనా వ్యంగ్యాస్త్రాలు, చ‌లోక్తులు న‌డిచాయి. మా మ‌గ‌జాతి ఎంత మంచిది అని కొంద‌రు జ‌బ్బ‌లు చ‌రుచుకుని మెచ్చుకుని మెడ‌లేసుకున్నారు కామెడీగా. కానీ.. అన్నింటికీ భిన్నంగా సిద్దార్త్ సుభాష్ చంద్ర‌బోస్ ఎఫ్‌బీ వాల్ పై ఆ అమ్మాయి చ‌ర్య‌ను స‌పోర్టు చేస్తూ రాసిన ఈ కామెంటు కూడా చర్చ‌కు తెర తీసింది. న‌చ్చినోడితో పెండ్లి చేయ‌క‌పోతే ఏమ‌వుతుందో చూశారా..? అని ప్ర‌శ్నించిన‌ట్టు, నిల‌దీసిన‌ట్టు.. త‌గిన శాస్తి ఇదే అన్న‌ట్టుగా ఉన్న ఈ కామెంట్ పైనా న‌డుస్తున్నాయి వ్యంగ్యాస్త్రాలు…..

You missed