రాధేశ్యామ్…. సాహో తర్వాత అంతకన్నా పెద్ద రేంజ్లో తీవ్ర నిరాశకు గురి చేసిన సినిమా. అసలు కథే ప్రధాన లోపం.. ఈ కథను ప్రభాస్ ఎలా ఎంచుకున్నాడో..? అర్థం కాదు. హస్త సాముద్రికం మీద కథంతా నడిపాడు. చేతి గీతల్లోనే విధి రాత ఉందని చెప్పేందుకు పాపం.. దర్శకుడు ఎన్ని తంటాలు పడ్డాడో. డాక్టర్లు, సైన్సు అంతా వేస్ట్ అన్నాడు. ఇంత ఘోరమైన కథల మనోళ్లకు ఎక్కడ దొరుకుతాయో… ? ప్రయోగాలు చేయండ్రా నాయనా అంటే.. ఇలా ముష్టి , మూఢనమ్మకాల కథలను వండి వార్చి.. దానికి భారీ బడ్జెట్ జోడించి … పెద్ద సెటింగులు.. గ్రాఫిక్స్… ఏదేదో చేసి ఏదో చేద్దామనుకున్నారు. కానీ ఎవరికీ నచ్చలే సినిమా. పరమ బోరింగ్. బూతు సినిమాల్లో బూతంతా చూపించి… చివరకు నీతి సూత్రాలు చెప్పినట్టు.. ఈ సినిమాలో హస్త సాముద్రికం గొప్పదనం గురించి.. విధి రాతను తప్పించుకోలేమని చెప్పేందుకు తంటాలు పడి.. పడీ.. చివరకు చేతిగీతల్లో మన తల రాతలేదు.. మన చేతల్లో ఉందని డైరెక్టర్ మంచి మాటతో ముగించేశాడు. అసలు దర్శకత్వ ప్రతిభే కనిపంచలేదు. సీన్లన్నీ పేలవంగా ఉన్నాయి. ప్రభావ్ లుక్కు మరీ అధ్వాన్నంగా ఉంది. గ్రాఫిక్స్ బొమ్మలాగా కనిపించింది చాలా చోట్ల అతని ముఖం. హీరోయిన్ కూడా ప్లస్ కాలేదు ఈ సినిమాకు. పాటలు ఎప్పుడు వచ్చాయో ఎలా పోయాయో తెలియదు. ముద్దు సీన్లు, రోమాన్సు.. మళ్లీ ఈ సినిమాకు.
తెలుగు సినిమాకు కథలు అవసరమే. భీమ్లా నాయక్, రాధేశ్యామ్ చూసిన తర్వాత బలంగా అనిపిస్తుంది.