ఝున్డ్ ” – నాగరాజ్ మంజులే

ఈరోజు రిలీజ్ అవ్వబోతున్న ఇంకో ఆసక్తికరమైన బాలీవుడ్ సినిమా ” ఝన్డ్ ”
సైరాట్ లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన నాగరాజ్ మంజులే బాలీవుడ్ కు కానుకివ్వబోతున్న విభిన్నమైన సినిమా ఝున్డ్.

నాగపూర్ లోని విజయ్ బర్సే అనే ఒక స్పోర్ట్స్ టీచర్… రిటైర్ అయిన తర్వాత , మురికివాడల్లోని వీధి పిల్లలతో ఒక ఫుట్ బాల్ టీమ్ తయారు చేసాడు.

.ముంబయి లోని స్లంల లోని అనాధ పిల్లలు అత్యంత నిరుపేద పిల్లలు మద్యం, సిగరెట్లు, స్మగ్లింగ్ , మత్తుపదార్ధాలకు , డ్రగ్స్ కు , నేరపూరిత జీవితాలకు ఎలా అలవాటుపడతారో చూసి వారిని తన భార్య కొడుకు సహాయం తో సన్మార్గంలో పెట్టె ఉత్తమ ప్రయత్నం చేశారు విజయ్ బర్సె..వాళ్ళ దుర్భర బాల్యం, వాళ్ళ చిక్కిశల్యమవుతున్న శరీరాలు చూసి బాధపడ్డాడు

లేత వయసులోనే జీవితపు అన్యాయపు లోతులు చూడడం , పోలీసుల దౌర్జన్యాలు , వాళ్ళు కూరుకుపోయిన కష్టాలు , వీటినుండి బయటపడేందుకు ఆ పిల్లలు ఇరవైనాలుగుగంటలూ వాసన పీల్చే ” వైట్నర్ ” దానికోసం వాళ్ళలో పోరాటాలు చూసి చలించిపోయిన ఆ టీచర్ వయిట్నర్ స్థానంలో వాళ్ళ చేతుల్లో ఫుట్బాల్ పెట్టాడు.
విజయ్ బర్సె జీవితం అమీర్ ఖాన్ ‘ సత్యమేవ జయతే ‘ లో తొలి ఎపిసోడ్ గా ప్రసారమైంది..

ఫుట్బాల్ ఆ వీధిపిల్లల జీవితాల్ని ఏ మేరకు ప్రభావితం చేసింది అనే ఇతివృత్తం తో తీసిన సినిమా ” ఝన్డ్ ”

ఇతర క్రీడా నేపథ్యంలో వచ్చిన సినిమాలకు ఝున్డ్ కు ఉన్న తేడా నాగరాజ్ చర్చించే ‘ కులం ‘ .మహారాష్ట్ర లోని ‘ కైకాడి’ ( ఎరుకల జాతి ) కి చెందిన పిల్లలు ఎదుర్కొన్న సంఘటనలకు రూపం ఇచ్చాడు.ఆధిపత్య కులాల ప్రివిలేజ్ కు క్రింది కులాల అసహాయత కు మధ్యఉండే తేడాలను ఒక ఎత్తైన గోడ ద్వారా కాప్చర్ చేసాడు.

అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో.. ఆకాష్ తోషు, సైరాట్ ఫేం రింకు రాజగురు ఇతర పాత్రలలో నటించారు.భూషణ్ కుమార్ నిర్మాతగా ఎక్కడా ప్రవచనాలు ప్రసంగాలు లేకుండా చాలా సహజంగా తనదైన స్టైల్లో తీసాడు నాగరాజ్ మంజులే.ఇప్పటికే భారీ అంచనాలతో ఈరోజు విడుదలైన’ ఝున్డ్ ‘ మరో సెల్ల్యులాయిడ్ జెమ్ కావాలని కోరుకుందాం.

Best wishes to the team ” Jhund”

Rajitha Kommu

You missed