బండి సంజయ్ చాలా విషయాల్లో వీక్. ఇది అందరూ ఒప్పుకునేది. అఖరికి ఆ పార్టీ నేతలతో సహా. ఆయన మాటలు కూడా సరిగా అర్థం కావు. అదో పెద్ద మైనస్. సబ్జెక్ట్ ఉండదు. తిట్టు, తీవ్ర ఆరోపణలు, బెదిరింపులు, హెచ్చరికలతోనే సరిపోతుంది. మసాలా మాటలే తనను నిలబెడతాయని, పార్టీకీ బలం తెస్తాయని నమ్మిన బీజేపీ నేతల్లో ఈయనొకడు. ఆఖరికి మొన్నటికి మొన్న కేసీఆర్ తిట్టిన తిట్లకు ఏం అనాలో అర్థం కాక… ఐఎస్ఐ తీవ్రవాదులతో లింకు ఉందంటూ ఓ వ్యాఖ్య చేశాడు. ఇదో పెద్ద ఆరోపణ… సంచలనం అవుతుందనుకున్నాడే ఏమో.. ఆ వ్యాఖ్య.. ఆ ఆరోపణ నవ్వుల పాలైంది. బండిని బుర్రలేని వాడని మరోసారి నిరూపించినట్టయ్యింది.
ఈ రోజు కేసీఆర్ బర్త్ డే. మామూలుగా ఇలాంటి సందర్బాల్లో రాజకీయాలు పక్కన బెట్టి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. నూరేళ్లు బతకండంటారు. ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటారు. చల్లగా జీవించండని దీవిస్తారు. బండి సంజయ్ అదే చేశాడు. హుందాగానే వ్యవహరించాడు. ఎవరుచెప్పారో ఏమో గానీ ఈ విషయంలో మాత్రం కాస్త బుర్ర ఉన్నదనిపించుకున్నాడు. కానీ మన ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డికి కాస్త వెటకారం పాలు ఎక్కువైంది. మెదడు గతి తప్పి గతుకుల రోడ్డులో పడిపోయినట్టుంది. కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పినట్టే చెప్పి… కింద ఊసరవెల్లి ఫోటో ఒకటి పెట్టాడు. నోటితో నవ్వుతో నొసటితో వెక్కిరించిన చందంగా. మరీ ఇంత దిగజారుడెందుకు..? ఇలాంటి సందర్భాల్లో కొంత హుందాగా ఉంటే సొమ్మేం పోతుంది. శుభాకాంక్షలు చెప్పాలనిపించకపోతే .. వదలెయ్. నిన్నెవడడిగాడు. చెప్పమని. ఇలా చెప్పడం వల్ల కేసీఆర్‌కు పోయేదేమీ లేదు.. నువ్వు నవ్వుల పాలు కావడం తప్ప.
ఊసరవెల్లి ఫోటోను ఈ కాంగ్రెస్ నేతలే మొన్న వాడారు. రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను సీఎం ఖండించిన విధానాన్ని కూడా వారు అంగీకరించలేదు. ఏదో తన మైలేజీ కోసం కేసీఆర్ అలా రాహుల్‌కు సపోర్టు చేశాడని, అతనివి ఊసరవెల్లి రాజకీయాలనీ వర్ణించారు. సరే, అది వారి రాజకీయ కోణం. ఎవరెలా అనుకున్నా మనకనవసరం. రాహుల్‌కు సపోర్టు చేయడం మూలంగా స్ట్రాటజికల్‌గా కేసీఆర్ సక్సెసయ్యాడు. కానీ కాంగ్రెస్ మాత్రం అందులో చాలా వెనుకబడి పోయి.. ఇలా పేలవమైన విమర్శలు చేసి సరిపెట్టుకుంది.
బర్త్‌డే రోజే నిరుద్యోగ సమస్యను బయటకు తీసి .. అరెస్టులయి.. కేసీఆర్‌ను తిట్టాలనుకోవడం కూడా మీ ఇష్టం. రాజకీయంగా ఇది కరెక్టు సందర్బమని మీరు భావిస్తే కూడా ఓకే. దాన్నెవరూ కాదనడం లేదు. కానీ బర్త్ డే విషెస్‌లో ఈ విషం చిమ్ముడేందీ రేవంతా…?