అవి ఇళయరాజా సినిమాల్లో బిజీగా ఉన్న రోజులు.. తనకు ఏదైనా ట్యూన్ తట్టనప్పుడు కారు డ్రైవ్ చేసుకుంటూ జగిత్యాల వచ్చేవాడు నా దగ్గరికి..

చిరంజీవి జగదేకవీరుడు-అతిలోకసుందరి సినిమా కోసం ట్యూన్స్ ఆలోచించడానికి ఓరోజు నా దగ్గరికి వచ్చాడు..

నేను,ఇళ్ళు మామా (ఇళయరాజాను నేను ముద్దుగా ఇళ్ళు మామా అంటాను) ధర్మపురి గోదావరి ఇసుకలో పల్లీలు తింటూ నడుస్తున్నప్పుడు సడెన్ గా ఒక దోమ ఇళ్ళు మామ ఎడమ చేతిమీద కుట్టింది..ఫట్ మని మామ దాన్ని కొట్టడం,నేను వెంటనే ‘మామా..అబ్బనీ తీయనీ దెబ్బ..’ అని పాడడం..అదే ట్యూన్ సినిమాలో పెట్టడం.. ఆ పాట చరిత్ర సృష్టించడం..అబ్బో ఆరోజులే వేరు..
నా జడ్జిమెంట్ కి అంత విలువ ఇచ్చేవాడు మామా..
( Sudeer kumar tandra)
…………………………

ఫేస్‌బుక్కులో ఇలా మంచు ఫ్యామిలీపై జోకులు పేలుతున్నాయి. మోహ‌న్‌బాబుకు ఉన్న గ‌ర్వం, అహంకారం, నేనే తోపు అనే ఫీలింగు ష‌రా మామూలుగా అత‌ని ఫ్యామిలీకీ వ‌చ్చిన‌ట్టుంది. ఉన్నంత‌లో కొంత మంచు మ‌నోజ్ బెట‌ర్‌. ఎక్కువ‌గా వేదిక‌ల మీద క‌నిపించ‌డు కాబ‌ట్టి స‌రిపోయింది. ఇక మంచు ల‌క్ష్మీ వ‌చ్చిరానీ టెలుగుతో ఇంగ్లీష్ యాక్సెంట్‌ను క‌ల‌గ‌లిపి టీవీ ప్రేక్ష‌కుల మీద‌.. అప్పుడ‌ప్పున‌డు వెండితెర మీద చెవికి ప‌ట్టిన త‌ప్పును వ‌ద‌ల‌గొట్టి.. వామ్మో అనిపించింది. మంచు ల‌క్ష్మీ యాంక‌రింగంటేనే అదో పెద్ద జోకుగా మారింది.

ఆ మ‌ధ్య ఆమె స్పెష‌ల్‌గా ఓ ప్రోగ్రాం కూడా చేసిన‌ట్టుంది. అందులో తండ్రి మోహ‌న్‌బాబుతో పాటు ఇద్ద‌రు మంచు పుత్రులు కూడా హాజ‌ర‌య్యారు. రాయ‌ల‌సీమ రామ‌న్న చౌద‌రి సినిమా చూసి ర‌జినీకాంత్ ఏకంగా మోహ‌న్‌బాబు కాళ్లే మొక్కాడంట‌. అంత బాగా తీశావ‌ని, త‌న‌దో కాద‌ని. అప్పుడప్పుడూ వాడ‌లా మొక్క‌డం అల‌వాటే అని కూడా అన్నాడు. ఎంత సేపూ త‌న కీర్తి కండూతి కోసం తండ్లాడుడే త‌ప్ప‌.. .ఎవ‌రేమ‌నుకుంటున్నారో.. ఎలా న‌వ్వుకుంటున్నారో.. ఎంత ప‌లుచ‌న‌వుతున్నామో వీరికి ప‌ట్ట‌దు. మా ఎన్నిక‌లమో గానీ మంచు విష్ణు నోటి నుంచి వెలువ‌డ్డ టంగుటూరి ప‌కాహం పంతులు ఈ హీరో నోరు తిర‌గ‌ని చ‌ప్పిడి ద‌వ‌డ‌ల స్థితిని ప్ర‌పంచానికి మ‌రో మారు తెలియ‌జేసింది. వార‌స‌త్వం పేరు చెప్పుకునేదుంటే త‌నే ప్ర‌పంచంలో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో ఉండేవాడిన‌ని కూడా అనేశాడు.

ఇక స‌న్ ఆఫ్ ఇండియా కొత్త సినిమా ఫంక్ష‌న్‌లో నైతే కాళ్లు మొక్కించుకోవ‌డం ఎంత గొప్ప‌ద‌న‌మో.. మొక్క‌క‌పోవ‌డం ఎంత‌టి భావ‌దారిద్ర‌మో కూడా విపులంగా విర‌రించి త‌న సంకుచిత‌, అతిశ‌యోక్తి, సూపిరియారిటీ కాంప్లెక్స్ మ‌న‌స్త‌త్వాన్ని చాటుకున్నాడు మోహ‌న్‌బాబు. ఇదీ న‌వ్వుల పాలైంది. అల‌వాటేగా వాళ్లు ప‌ట్టించుకోరు. అలా వాగుతూనే ఉంటారు. ఒక‌ర్నొక‌రు పొగిడేసుకుంటూనే ఉంటారు. ఇత‌రుల‌ను త‌క్కువ చేసి మాట్లాడుతూనే ఉంటారు. త‌మ‌క‌న్నా ఉన్న‌త‌మైన వాళ్లే లేర‌ని ప్ర‌పంచానికి తెలియ‌జెప్పేందుకు వేదిక‌ల మీద ఇలా న‌వ్వుల పాల‌వుతూనే ఉంటారు.