ఇరిగేషన్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ రజత్ కుమార్ కూతరు పెండ్లికి మెగా క్రిష్టారెడ్డి (మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ లిమిటెడ్..meil) కానుకగా ఖర్చులన్నీ భరించాడని ఓ వార్త సంస్థ నిగ్గు తేల్చడం కలకలం సృస్టిస్తున్నది. ఓ బోగస్ సంస్థ ( బిగ్ వే ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్) ద్వారా పెండ్లి , విందుకు అయిన ఖర్చులన్నీ బిల్లుల రూపంలో చెల్లించాడని ఈ వార్త సంస్థ రాసింది. ఇప్పుడిది సంచలనం సృష్టిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించిన కాంట్రాక్టుల నేపథ్యంలో మెగా కంపెనీ ఈ ఐఏఎస్ ఆఫీసర్‌కు ఈ ఫేవర్ చేసిందని పేర్కొన్నది ఆ వార్త సంస్థ.
బోగస్ సంస్థను సృస్టించి, బోగస్ ఈ మెయిల్ అడ్రస్‌లతో హోటళ్లు బుక్ చేసుకున్న వైనాన్ని ఆధారలతో సహా టీఎన్ఎం అనే వార్త సంస్థ తాజాగా ప్రచురించింది. బిగ్ వే అనే సంస్థ అడ్రస్ ద్వారా నిజనిజాలు తెలుసుకున్న సంస్థ.. ఇదంతా బోగస్ అని తేల్చింది. కాంట్రాక్టుల ద్వారా లబ్దిపొందిన మెగా క్రిష్టారెడ్డి.. ఈ విధంగా రజత్ కుమార్‌కు సహాయపడ్డాడనేది ప్రధాన ఆరోపణ. ఇదిప్పుడు ప్రభుత్వంలో కలకలం రేపుతున్న వార్త. దీని పై ఇంకా ప్రభుత్వం నుంచి పెద్దలెవరూ స్పందించలేదు.
మెగా క్రిష్టా రెడ్డి స్పందించాడు. ఆ సంస్థకు తమకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నాడు. రజత్ కుమార్ కూడా స్పందించాడు. పెండ్లికి సంబంధిoచిన హోటల్ బుకింగ్స్ అన్నీ తనే చేసుకున్నానని చెప్పాడు.
గతంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసిన సమయంలో కూడా రజత్‌కుమార్ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.