వాడి పేరు శివ. మొన్న నాకు ఫేస్‌బుక్కులో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిండు. అనుమానం వచ్చింది. వీడు నాకు ఫ్రెండ్‌గానే ఉన్నాడే.. అనుకుంటూ రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేసిన. వెంటనే హలో.. అని మెస్సేజ్. అనుకున్న వీడెవడో ఫేక్‌గాడే అని. రిప్లై ఇవ్వలే. ఊకున్నడు. మళ్లా ఇయ్యాల వచ్చిండు లైన్లకి. హలో.. హౌ ఆర్‌యూ అంటూ. వాడు కచ్చితంగా నన్ను అన్న అనే సంబోధిస్తడు. వీడు ఫేక్‌గాడు కదా.. డైరెక్టు విషయానికొచ్చేశాడు. బాగా బీజీ ఉన్నట్టన్నాడు. ఇంకా ఎన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసిండో..? ఎంత మందితో చాటింగ్ చేయాల్నో..? ఎన్నెన్ని పైసలు అడగాల్నో పాపం… అనుకున్న. ఫేక్ గాడివి నువ్వే బిజీ అయితే నేను బిజీ కాకుండా ఖాళీగా ఉన్నాన్రా.. అనుకుని.. నేనూ డైరెక్ట్ మ్యాటర్‌లోకి వచ్చేశా. ఇలా జరిగింది మా సంభాషణ.
హలో
(వాడు ఇంగ్లీష్.. నేను తెలుగు. కావాలనే. వాడికి తెలుగు అర్థం కాదనే)
ఏం కావాలి.
వేర్ ఆర్‌యూ నౌ (ఇంగ్లీష్)
పైసలు లేవు ( తెలుగు)
మై అర్జంట్ ప్రాబ్లెం (ఇంగ్లీష్)
చెప్పిన కదరా పైసలు లేవని ( తెలుగు)
I need urgent 12000 rs
Can you send
Emergency is too much
My account limit problem
I will be return 3 hours
ఇలా వరుసగా పెట్టాడు మెస్సేజ్‌లు. నీతో ముచ్చటేందిరా.. పైసలు పడేయ్ అనే రేంజ్‌లో స్పీడ్‌గా పెట్టేశాడు.
నీ యయ్య పైసలు లేవని చెప్పిన కదరా సాలె
How much your account available balance
Tell me ( వాడి బాధ వాడిది)
ఏ ఊరురా నీది బాడ్కావ్..
వానికి అర్థం కాలే. ఏం చేయాల్నో తెల్వలే. తన దొంగ తెలివంతా ఉపయోగించి చీకట్లో రాయేశాడు.
వావ్ .. అని. ఏ ఊరురా అని తిడితే వాడు వావ్ అన్నాడు.
How much your account available balance
Plz 🙏
Tell me ( పాడిందే పాటరా…. మళ్లా వాడి బాధ వాడిదే)
సమజైత లేదరా సాలేగా….
నా టైమంతా వేస్ట్ చేస్తున్నాడు.. వీడో వేస్ట్‌గాడున్నట్టున్నాడు.. అనుకున్నట్టున్నాడు ఆ ఫేక్ గాడు. అక్కడితే ఆపేశాడు చాటింగ్. ఇంకొకడి వేటలో ఇప్పుడాడు బిజీగా ఉన్నాడు. ఆ బక్రా ఎవడో…