జ‌ర్న‌లిజం కొత్త పుంత‌లు తొక్కుతున్న‌ది. సంచ‌ల‌నాల కోసం దేనికైనా రెడీ అంటున్న‌ది. పాతాళానికి దిగ‌జారిపోవ‌డానికైనా సిద్ద‌ప‌డుతున్న‌ది. అంత‌టి మార్పు వ‌చ్చేసింది మీడియాలో. జ‌ర్న‌లిస్టులు కూడా త‌మ ఉనికి చాటుకోవ‌డానికి నానా గ‌డ్డి క‌రుస్తున్నారు. దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. భ‌జ‌న‌లో పోటీ ప‌డుతూ త‌మ‌ను గుర్తించండి చాలు జీవితం ధ‌న్య‌మ‌నే రేంజ్‌లో పారాడ‌తున్నారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులా, జూనియ‌ర్లా అని కాదు ఇక్క‌డ … అంత‌టా అట్ల‌నే ఉంది ప‌రిస్థితి. ఇత‌ని పేరు రాంబాబు అట‌. టీవీ 5 జ‌ర్న‌లిస్టు. త్రిపుల్ ఆర్ మూవీ ప్రోమో ప్రెస్‌మీట్లో ఇత‌ను ఓ ప్ర‌శ్న‌వేశాడు. ప్రీమియ‌ర్ షో వేస్తారా? అని.

దానికి తెలియ‌దు.. చూడాలి అన్నాడు. ఆంధ్ర‌లో టికెట్ల లొల్లి విష‌యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ కు స‌న్నిహితులుగా ఉన్న కొడాలి నాని స‌హాయం తీసుకుంటారా..? అని నిర్మాత‌ను అడిగాడు. ఇది పాత విష‌య‌మే. మొన్న‌టి వ‌ర‌కు కొడాలి నాని, జూనియ‌ర్ ఎన్టీఆర్ ల మ‌ధ్య స‌ఖ్య‌త ఎలా ఉందో వారే చెప్పుకున్నారు. దీనిపై ఎన్టీఆర్ మౌనం వ‌హించాడు. ఏం చెప్ప‌లేదు. నిర్మాత కూడా సాఫ్ట్‌గా ఆన్స‌ర్ ఇచ్చి ఆ విలేక‌రినే ఖంగుతినిపించాడు. కానీ మ‌న విలేక‌రి మాత్రం అదేదో ఘ‌న‌కార్యం చేసిన‌ట్టు.. త‌న ప్ర‌శ్న సంచ‌నాల‌కు తెర తీసిన‌ట్టు.. త‌న ఛాన‌ల్‌లోనే ఓ వార్త‌గా ప్రెజెంట్ చేసుకుని… త‌న డ‌బ్బా త‌ను కొట్టుకుని.. యాక్‌… థూ……. మీరు మీ జ‌ర్న‌లిజం…

 

You missed