మ‌హాధ‌ర్నాలో పాల్గొన్న కేసీఆర్ వేదిక మీద రాంగ‌నే అక్క‌డ ఏర్పాట్లు చేసి ఫైర్ అయ్యాడు. హ‌రీశ్‌రావు, శ్రీ‌నివాస్ యాద‌వ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చేసిన ఏర్పాట్ల‌లో కొంత అతి ఉంద‌ని గ్ర‌హించాడు కేసీఆర్‌. గిందేదీ వ‌యా.. గిన్న‌గానం ప‌రుపులు, మెత్త‌లు ఏసిండ్రు. మ‌న‌మేమ‌న్నా ధ‌ర్నా చేస్తున్న‌మా… ? ఈడ పండుకోనికి వ‌చ్చిన‌మా..? తీసేయుండ్రి.. అవ‌న్నీ.. అని అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యే స‌రికి ఏకంగా హ‌రీశ్‌రావే ప‌రుపుల‌న్నీ త‌సేశాడు. మెత్త‌లు ప‌క్క‌కు జ‌రిపారు. ప‌రుపుల‌తో ఇంతెత్తున పెంచిన వేదిక త‌గ్గించినంక‌నే కేసీఆర్ ఆడ కూసుకున్న‌డు.

ఈ మ‌ధ్య వైఎస్ ష‌ర్మిల దీక్ష‌లు చేస్తే ఇట్ల‌నే మెత్త‌గా ప‌రుపులేసుకుని, ద‌ర్జాగా కూసుని, ఓ చిరున‌వ్వు న‌వ్వుకుంటూ కూసున్న వీడియోలు కేసీఆర్ చూసిన‌ట్టున్న‌డు. ఛ‌ల్‌.. గా ప‌ద్ద‌తి ఈడ కూడా పాటిస్తుర్రా.. అని చిర్రెత్తుకొచ్చిన‌ట్టుంది. అన్నీ తీసేపించాడు. ఏదో మంచిగా ఏర్పాట్లు చేసి కేసీఆర్ చేత శ‌భాష్ అనిపించుకుందామ‌నుకున్న హ‌రీశ్‌కు, శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు చ‌ల్ల‌టి చ‌మ‌ట‌లు ప‌ట్టాయి. ద‌బ్బ ద‌బ్బ ఆ ప‌రుపుల‌న్నీ తీసేశారు. రాంగనే మూడ్ ఖ‌రాబ్ అయ్యింది కేసీఆర్‌కు ఇది చూసి.

ఆ వెంట‌నే డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ వ‌చ్చిండు. చేతిలో ద‌ట్టీ ప‌ట్టుకుని. ఎప్ప‌డూ వేదిక‌ల మీద ఇలా క‌ట్టి కేసీఆర్‌ను కార్యోన్ముఖుడ్ని చేస్తాడ‌న్న‌మాట ఆయ‌న‌. కానీ ఈసారి కేసీఆర్ మ‌హ‌మూద్ అలీని చేతిని దూరంగా విసిరికొట్టాడు. ఏమొద్దు పో అన్న‌ట్టుగా ఓ లుక్కిచ్చి కూసున్న‌డు. ఖంగుతిన్న అలీ ఆడ్నుంచి జారుకున్న‌డు.