హాస్య‌న‌టుడు బ్ర‌హ్మానందం న‌టిస్తే చాలు ఆ సినిమా హిట్టు. అత‌ను లేకుండా ఏ పెద్ద హీరో కూడా సినిమా తీసేవాడు కాదంటే అతిశ‌యోక్తి లేదు. మంచి హాస్య నటుడు. దాదాపు రెండు ద‌శాబ్దాలుగా తెలుగు సినీ రంగాన్ని ఏలాడు. రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌ర్వాత అంత‌లా తెలుగు ప్రేక్ష‌కుల‌ను కుడుపుబ్బా న‌వ్వించింది బ్ర‌హ్మానందమే. కొత్త హాస్య‌న‌టులు ఎంత మంది తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైనా.. బ్ర‌హ్మానందానికి ఉన్న క్రేజ్ త‌గ్గ‌లేదు.

బాబాయ్ హోట‌ల్ సినిమాతో మెయిన్ రోల్ పోషించి.. న‌వ్వించ‌డ‌మే కాదు.. బ్ర‌హ్మానందం ఏడిపించ‌గ‌ల‌డు అని నిరూపించుకున్నాడు. హాస్య బ్ర‌హ్మ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అహ నా పెళ్లంట సినిమాతో ఆరంగేట్రం చేసిన బ్ర‌హ్మానందం అర‌గుండు వెధ‌వ అని కోటతో తిట్టించుకునే న‌త్తి ఉన్న పాత్ర‌లో అద్భుత న‌ట‌న క‌న‌బ‌రిచాడు. ఆ త‌ర్వాత ఇక వెనుదిగిరి చూసుకోలేదు. బావాగారు బాగున్నారా చిరంజీవి సినిమా హిట్ట‌య్యిందంటే అందులో న‌టించిన బ్ర‌హ్మానందం కామెటీ ట్రాక్‌దే ప్ర‌ధాన రోల్‌.

ఇలాంటి సినిమాలు బ్ర‌హ్మ‌నందం కెరీర్‌లో చాలా ఉన్నాయి. ఎంతో మంది పెద్ద న‌టుల‌కు త‌న హాస్య న‌ట‌న‌తో హిట్‌ను తీసుకువ‌స్తే.. కొత్త న‌టుల ప‌రిచ‌యాల‌కు ఊత‌మిచ్చి వారు మ‌రిన్ని సినిమాలు తీసేలా త‌న న‌ట‌న‌తో తోడ్పాటునందించాడు. గ‌త ఏడాదిన్న‌ర‌గా ఆయ‌న సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఆరోగ్యం బాగాలేక .. ముంబ‌యిలో ఆయ‌న కొద్ది రోజులు చికిత్స తీసుకున్నాడు. ఆ త‌ర్వాత చాలా రోజుల‌కు జాతి ర‌త్నాలు సినిమాలో జ‌డ్జి రోల్ పోషించాడు.

ఈనాడు రిలీజ్ అవుతున్న తెలంగాణ దేవుడు సినిమాలో కేసీఆర్ గురువు మృత్యుంజ‌య శ‌ర్మ పాత్ర పోషిస్తున్నాడు. మ‌రో సినిమా షూటింగ్‌లో ఉంది. ఇక‌పై ఆయ‌న చాలా లిమిటెడ్ సినిమాల్లో న‌టించ‌నున్నాడు. ఇక హాస్య పాత్ర‌లు ఆయ‌న చేయ‌రు. ఏదైనా ప్ర‌ధానపాత్ర‌ల‌కే ప‌రిమితం కానున్నారు. ఇది ఆయ‌న‌కు సెకండ్ ఇన్నింగ్స్‌. ఈ ఇన్నింగ్స్‌లో హాస్య బ్ర‌హ్మానందం ఉండ‌డు. క‌డుపుబ్బా న‌వ్వించే పాత్ర‌లు చేయ‌డు. గంభీర వ‌ద‌నంతో కంట‌నీరు పెట్టించే పాత్ర‌లు చేస్తాడేమో…

 

 

You missed