అబద్దం ఆడినా.. నిజం చెప్పినా.. కేసీఆర్ స్టైలే వేరు. ఏదైనా చెబితే అది కచ్చితంగా జరుగుతుందని అనిపించేలా ఆయన మాటలుంటాయి. అలా నమ్మబలుకుతాడు. అది అప్పటి అవసరం. కానీ ఆ తర్వాత అవసరాలు మారొచ్చు. ఆడిన మాట తప్పొచ్చు. అలా మాట తప్పడం పెద్ద తప్పే కాదని చెప్పొచ్చు. అలా చెప్పిన దానికీ మద్దతు లభించేలా మాట్లాడొచ్చు. ఎలా మాట్లాడినా.. మాట్లాడింది నిలబెట్టుకున్నా.. నిలబెట్టుకోకున్నా.. అంతా ఆయనకే చెల్లుతది. కేసీఆర్ అంటే అంతే..
అవును.. దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన.. చాలా కారణాలున్నాయి. చెయ్యలేదు. కానీ మళ్లా మమ్మల్ని ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు కదా.. అని టేకీటీజీగా…. అలా అలా చెప్పేశాడు. అసలది తప్పే కాదని, ఆడిన మాట తప్పడం అసలే కాదని. అర్థం కాని విషయమేమిటంటే.. మధ్యలో షబ్బీల్ అలీ పేరును వాడుకున్నాడు. ఆయనే ఎస్సీని సీఎం చేయనివ్వలేదు అని కూడా అన్నాడు. ఏందో ఆ మతలబు. ఆయనెవరో చేయనివ్వకపోతే.. ఈయన చెయ్యలేదంట. హామీ ఇచ్చింది కేసీఆర్. మాట తప్పింది కేసీఆర్. అంతే. మధ్యలో షబ్బీర్‌తో మాకేం లెక్క…?
సరే, ముఖ్యమైన దళిత ముఖ్యమంత్రి హామీనే తుంగలో తొక్కి అదో పెద్ద తప్పు కాదు.. తప్పలేదు అన్నట్టు మాట్లాడిన కేసీఆర్…
ఇక మ్యానిఫెస్టో మీద అపారమైన నమ్మకం పెట్టుకోవాలి.. మీరు చెప్పాలి. మేము వినాలి.
వింటూనే ఉండాలి. మీరు చెప్తూనే ఉండాలి.