ఆంధ్రలో పాక్షన్ రాజకీయాలు పడగవిప్పాయి. పగలు పట్టపగలే రాజ్యమేలుతున్నాయి. దాడులతో తెగబడి తమ పాత సంస్కృతి ఇదీ అని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాయి.జగన్ దూకుడు, దుండుడుకు రాజకీయాలకు ఇదో నిదర్శనం. ప్రతీకారేచ్చకు ఇదో మచ్చుతునక. పడుకున్నోడి లేపి మరీ తన్నించుకోవడన్నమాట. చంద్రబాబును జనం మరిచిపోతూ ఉంటే.. మన జగనే మళ్లీ ఇలా ఏదో విధంగా జనాల్లోకి తెచ్చి కూర్చోబెడుతున్నాడు. హుందాగా ఉండాల్సిన అధికార పార్టీ రాజకీయాలకు పగలు. ప్రతీకారాలతో రగిలిపోతున్నాయి. ప్రతిపక్షాన్ని మొత్తమే లేవనీయకుండా చేసే ఎత్తుగడలు అక్కడి రాజకీయాల్లో కొత్తమే కావు. కానీ జగన్ ఇందులో రెండాకులు ఎక్కువే చదివినట్టున్నాడు.
ఆకలి మీదున్న పులి.. ఆవురావురామన్నట్టు.. టీడీపీని చీల్చి చెండాడడమే ప్రధాన పనుల్లో మొదటి పనిగాపెట్టుకున్నాడు జగన్. సరే రాజకీయాలంటే అంతే. కానీ.. ఇప్పటికే ప్రజల్లో మెల్లగా వ్యతిరేకత కూడగట్టుకుంటున్న జగన్‌కు ఇలాంటి చర్యలు మరింత నష్టం తెచ్చిపెట్టేవే తప్ప. ఉపయోగపడేవి కావు. ఎవరో టీడీపీ నేత తనను లంజాకొడుకా అన్నాడని స్వయంగా జగనే సభావేదిక మీద చెప్పుకుని దెప్పిపొడవడం.. ఆంధ్ర దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టగా మారాయి. వాస్తవంగా జగన్‌కు అధికారం రావడం వెనుక చంద్రబాబు నీతిమాలిన, పనికిమాలిన, అహంకారపు పాలనే . కానీ అది తెలుసుకునేందుకు చాలా సమమయే పట్టింది. జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉన్నది.
అప్పటి వరకు అది బలుపనుకుని మిడిసిపడ్డ చంద్రబాబు.. అది వాపే అని తెలుసుకోవడానికి ఇంత సమయం పట్టంది. ఇప్పుడు నేలకు దిగాడు. దీక్షలకు సిద్ధపడుతున్నాడు. ఎంత సీనియర్ అయితేనేం.. ప్రజలు మార్పు కోరుకుంటారు. తనను మించినవాడు లేడనే అహంకారపు మాటలు, పాలన ను ఎవరూ ఎల్లకాలం అంగీకరించరు. అదే జరిగింది చంద్రబాబు విషయంలో. ఇప్పుడు జగన్ కూడా అందుకు విరుద్ధంగా ఏమి పోవడం లేదు. చచ్చిన పామును బతికించేందుకు ఆరాటపడుతున్నాడు. చంద్రబాబును బద్దలు కట్టి మరీ లేపుతున్నాడు.
జగన్ పాలనపై అక్కడి ఉద్యోగులు గుర్రుగానే ఉన్నారు. కొన్ని సెక్షన్లు అసంతృప్తిగా ఉన్నాయి. ఈ వర్గాల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. అభివృద్ధి లేదు. సంక్షేమమే ప్రధానంగా తాయిలాలపై జగన్ ప్రభుత్వం ఆధారపడింది. దీనికి తోడు ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు.. జగన్ ప్రభుత్వానికి ఓ మచ్చలాగే మిగిలిపోనున్నాయి. ఆంధ్ర రాజకీయాలతో పోల్చితే ఇప్పటికే తెలంగాణ రాజకీయాలు కాస్త నయమే. ఇక్కడ కూడా కథ ముదిరి పాకాన పడుతోంది మెల్లమెల్లగా.
పొరుగోళ్లను చూసి మనోళ్లు కూడా మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుని ఇక్కడా అదే మ్యానిఫెస్టోను అమలు చేసినా ఆశ్చర్యం లేదు. అలా శరవేగంగా రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయి మరి. గతంలో ఎన్నడూ చూడని, వినని రాజకీయాలైతే తెలంగాణలోనూ ఉన్నాయి. మనమూ డెవలప్ అవుతున్నామన్నమాట. మెల్లమెల్లగా.