ఎన్ని సర్వేలు చేసినా.. ఎంత ఖర్చు పెట్టినా.. ఇంకా అక్కడ ఈటలకే మొగ్గు కనబడుతున్నదట. టీఆరెస్ గెలుపు నల్లేరు మీద నడకమాత్రం కాదట. ఎందుకలా? వేల కోట్లు గుమ్మరిస్తున్నాం.. శక్తులన్నీ దారపోస్తున్నాం.. అందరినీ కొనేస్తున్నాం ఎడాపెడా. పదవుల పంపకాలు చేస్తున్నాం.. ఇంకా ఇస్తామని ఆశలు రేపుతున్నాం.. అయినా.. ఇంకా ఈటలకే మొగ్గు.. ఆయనకే ఛాన్సు… టీఆరెస్ కష్టం.. ఇదేందీ.? ఇంకానా ..? మరింకేం చెయ్యాలి..? ఏం చేసినా అంతే. సిద్దిపేటకు హరీశ్ ఎలాగో.. హుజురాబాద్‌కే ఈటల అలాగ. అవునా..? అంత సీనుందా ఈటలకు అక్కడ. ఉంది. అక్కడ అలా పాతుకుపోయాడు ఈటల మరి. సేమ్ మన హరీశన్న లెక్కనే. ఎంత ఖర్చు చేసినా ఎన్ని తంటాలు పడ్డా ఇదేందిరా నాయన. ఈటల … ఈటల.. ఈటల.. ఎక్కడ చూసినా ఇదే మాట. ఏ సర్వే చూసినా ఈటల మాటే. ఏ ఫలితాలు చూసినా ఈటల పాటే. ఇలాగైతే ఎలా.. ? ఏం చేద్దాం…
ప్రొఫెసర్ కే నాగేశ్వర్ చేసిన ఓ సర్వే రిపోర్టు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అందులో ఈటలకు 69 శాతం ఓట్లు రాగా, టీఆరెస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 16 శాతం, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్‌కు 12 శాతం ఓట్లు వచ్చాయి. ఇదీ సంగతి.