కాంగ్రెస్ హుజురాబాద్‌ను పట్టించుకోవడం లేదు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నది. పరోక్షంగా ఈటల గెలుపు కోసం డమ్మీ క్యాండిడేట్‌ను పెట్టబోతుందని ప్రచారం బాగా చేశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్రచారానికి గట్టి జవాబు నిచ్చింది. క్యాండేట్ ఎవరో ఇంకా .. ఇప్పటికీ స్పష్టత లేదు. ఎవరిని పెడతారో తెలియదు. కానీ .. ప్రచారం కోసం స్టార్ క్యాంపెనెయర్‌ల లిస్టు మాత్రం ఒకటి రిలీజ్ చేసింది. అది చూస్తేనే తెలిసిపోతుంది .. కాంగ్రెస్ హుజురాబాద్‌ను ఎంత సీరియస్‌గా తీసుకున్నదో. ఇక చావో రేవో అని కొట్టాడబోతుందన్నమాట.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్కం ఠాకూర్, శ్రీనివాసన్ కృష్ణన్ తప్ప.. మిగిలిన 18 మంది అంతా సీఎం అభ్యర్థులే. అవును.. నేను సీఎం అంటే నేను సీఎం.. అనే వాళ్లు. అలాంటి వాళ్లను ప్రచారానికి వాడుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవక ఏం చేస్తాడు. కచ్చితంగా గెలిచి తీరుతాడు. అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు.. టీఆరెస్ లాగ. టీఆరెస్ కూడా గెల్లు శ్రీనివాస్‌ను ఎక్కడా ఫోకస్ చేయడం లేదు. అంతా హరీశ్ రావు భుజానేసుకుని తిరుగుతున్నాడు. కాలికి బలపం కట్టుకుని కలియతిరుగుతున్నాడు. గెల్లు కేవలం చేతులెత్తి దండం పెడుతూ .. ఓట్లు అడుగున్నాడు. అంతే. మిగిలిందంతా మన టీఆరెస్ టీమే చూసుకుంటున్నది.
ఇప్పుడ అదే రేంజ్‌లో కాంగ్రెస్ కూడా 18 మంది సీఎం అభ్యర్థులను బరిలోకి దింపి ఒక్క అభ్యర్థిని గెలిపించుకు రమ్మంటున్నది. ఇదో పెద్ద లఖ్కా.. కచ్చితంగా గెలిపించుకు వస్తారు. లిస్టులో ఎవరెవరి పేర్లున్నాయో తెలుసుకోవాలనుందా.. రేవంత్‌రెడ్డితో మొదలై… టీ జీవన్‌రెడ్డి, డీ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహా, మధుయాష్కీ గౌడ్, ఏ మహేశ్వర్‌రెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీ హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మహ్మద్ అజారుద్దీన్, టీ జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, సీతక్క.. ఇలా ఉంది లిస్టు. బీరెడీ .. హుజురాబాద్.