అసెంబ్లీలో సీఎం కేసీఆర్ త్వరలో 80వేల ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి మాట్లాడితే దీన్ని తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మొన్నటి వరకు రెడ్‌లేబుల్ టీ పౌడర్.. అయ్యయ్యో వద్దమ్మా..! టైపులో దీన్ని అయ్యోయ్యో వద్దయ్యా..! అని సెటైరికల్‌గా కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇది కొంత నవ్వు తెప్పిస్తుంది. ఇందులో దాగున్న నిజాన్ని కూడా పరోక్షంగా ఇది వెల్లడి చేస్తున్నది.
దుబ్బాక ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఎంఎల్‌సీ ఎన్నికల్లో, నాగార్జున సాగర్ ఎన్నికల్లో… ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలిచ్చారు. మళ్లీ ఇప్పుడు 80 వేల ఉద్యోగాలు అంటే నిరుద్యోగులు తట్టుకోలేరు.. సుఖీభవ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ అంటే నవ్వులాటలా మారింది మరి. మన పాలకులు చేస్తున్నది కూడా అట్లనే ఉంది. ఊరించి ఊరించి చంపుతున్నారే గానీ, నోటిఫికేషన్లు మాత్రం వేయడం లేదు. ఇదిగో ఇలా అసెంబ్లీ సాక్షిగా చెప్పినా.. మేం నమ్మం అనే విధంగా ఇలా సెటైరికల్ కామెంట్లతో తమ నిరసనను తెలుపుతున్నారన్నమాట. జర దీన్ని ఈసారైనా గట్టిగా ఇంప్లిమెంటేషన్ చేయండి సీఎం సారూ..!