పాదయాత్ర కోసం కల్లు ముస్తేదారు వద్ద 20 లక్షలు డిమాండ్ చేసిన కేసులో విచారణ నిమిత్తం 2 రోజుల పాటు తీన్మార్ మల్లన్నను ఎడపల్లి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న తీన్మార్ మల్లన్నను ఈ రోజు ఎడపల్లి పోలీసులు కస్డడీ కోసం అనుమతి కోరారు. 48 గంటల పాటు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఎడపల్లి పోలీసులు ఈ కేసు విషయమై విచారణను రికార్డు చేస్తున్నారు. బీజేపీలో చేరుతున్నానని ఇది వరకు తీన్మార్ మల్లన్న ప్రకటించి ఉన్న విషయం తెలిసిందే. కేసుల బారి నుంచి తప్పించుకునేందుకే మల్లన్న బీజేపీ పంచన చేరాడనే విమర్శలున్నాయి.