ఆనాడు ఉద్యమంలో బతుకమ్మ పండుగ ఎంతో కీలక పాత్ర పోషించింది. మహిళా లోకాన్ని చైతన్యవంతం చేసింది. అందరినీ ఉద్యమం వైపు నడిపించింది. స్వాతంత్రోద్యమంలో ఆనాడు వినాయక చవితి పండుగను బాల గంగాధర్ తిలక్ ఏ విధంగానైతే ప్రజా చైతన్యానికి వేదికగా వాడుకున్నాడో.. బతుకమ్మను కూడా టీఆరెస్, ఉద్యమ కారులు, మేథావులు ఉద్యమంలో కీలకంగా ఉపయోగించుకున్నారు. మంచి ఫలితాలే వచ్చాయి.
కానీ ఇప్పుడా బతుకమ్మ వచ్చిన తెలంగాణలో బందీ అయిపోయింది. రాజకీయాలకు బలైపోతున్నది. రాజకీయ నాయకుల క్రీడలో పావుగా మారింది. ఒక్క హుజురాబాద్ ఎన్నిక రాజకీయాలను , నాయకులను ఎంతగా కలుషితం చేశాయంటే.. పాతాళంలోకి దిగజారినా.. సిగ్గు పడకుండా తమ పంథాను కొనసాగిస్తున్నారు. గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్నారు. దాని కోసం ఎంతటి దారుణాలకైనా తెగబడుతున్నారు. దిగజారుతున్నారు.
ఒకరు కేసీఆర్ ఫాం హౌజ్‌కు గురించి పాడుకుంటారు. ఇంకొకరు సిలిండర్ ధర పెరగిందని కై గట్టి ఫేక్ వీడియోను పాత వీడియోకు లింకు పెడతారు. ఇప్పుడు ఏకంగా బతుకమ్మల మధ్యలో సిలిండర్లను పెట్టి ఆడుతున్నారు. పాడుతున్నారు. అది ఎక్కడో కాదు. హుజురాబాద్‌లో. ఇప్పటికే మీకు అర్థమైపోయిందనుకుంటా. అక్కడ అమ్మలక్కల స్వేచ్చకు, పండుగ వాతావరణాని బ్రేక్ వేసింది…కలుషితం చేసింది ఎవరై ఉంటారు..? పక్కా టీఆరెఎస్సే.
సిలెండర్లు పెట్టి పాటలు పాడితే మీడియాలో వస్తుంది. బీజేపీ డ్యామేజీ అవుతుంది. టీఆరెస్‌కు మైలేజీ వస్తుంది. ఇగో ఇలా
సాగుతున్నాయి.. మన సంకుచిత మనస్తత్వ రాజకీయ నేతల ఆలోచనలు. ఒరే.. ఏడాదికొకసారి పండుగరా..! వాళ్లనలా హాయిగా ఆడుకోని. వాళ్ల ప్రపంచంలో వారు స్వేచ్చగా విహరించని. మధ్యలో మీ రొచ్చు రాజకీయాలేందిరా.. పిచ్చి వెధవల్లారా..!!