ప్రేమ, కామెడీ, పాటలు, కుటుంబ బంధాలు, సంబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు.. ఇవన్నీ కలగలిపి తీసిన సినిమా నిన్నే పెళ్లాడుతా. నాగార్జున సినీ కెరీర్‌లో ఇదో మైలు రాయి. గీతాంజలి తరహా ఓ మెమరబుల్ సినిమా ఆయన జీవితంలో. అన్ని వర్గాలకు ఆకట్టుకున్నది. గ్రీకు వీరుడు అంటూ పాడే పాట అప్పట్లో ట్రెండ్ సెట్టర్. పాటలన్నీ సూపర్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఒక్కటేంటి. అన్నీ ప్లస్‌లే. ఈ సినిమాకు పాతికేళ్లు.. కానీ ఇప్పటికీ అదే పరిమళం.
ఆ పాటలు వింటే అంతే మధురం. ఆ సినిమా సీన్లన్నీ మన ఇంట్లోనే .. పక్కింట్లోనే జరిగాయా? అనే విధంగా చిత్రీకరణ. కృష్ణ వంశీకి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చంద్రలేఖ మాత్రం ఫ్లాప్‌ను మూగగట్టుకుంది. మళ్లీ ఇలాంటి సినిమాను తీసేందుకు ఎవరు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. నాగ చైతన్యతో రారండోయ్ వేడుకు చూద్దాం.. ఇలాగే ట్రై చేద్దామనుకున్నారు. కానీ కుదరలేదు.