ఈసారి బతుకమ్మ పండుగ పాట అంబరాన్నంటనుంది. అంతర్జాతీయ స్థాయికి ఎదగనుంది. ప్రతీసారి పండుగ పాట అద్భుతంగా మలిచి అందరినీ ఆకట్టుకునేలా చేస్తున్నది తెలంగణ జాగృతి. ఈసారి ఓ కొంగొత్త ఆలోచనలకు నాంది పలికింది. ప్రముఖ సీనీ దిగ్గజాలతో ఈ బతుకమ్మ పాటకు జీవం పోయనుంది జాగృతి టీం. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రహమాన్ ఈ పాటకు బాణీలు సమకూర్చాడు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ పాటను తన దర్శకత్వ ప్రతిభతో అద్భుతంగా మలిచాడు.
ఈనెల 6 నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నందున.. ఆ లోపు ఈ పాటను విడుల చేసేందుకు అన్నీ సిద్ధం చేశారు. ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో జాగృతి వ్యవస్థాప అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తో ఈ సాంగ్ షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. ఫిల్మ్ సిటీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా అద్బుత లొకేషన్లో ఈ పాట దృశ్యరూపం తీసుకున్నది. దీనిపై అందరికీ భారీ అంచానాలున్నాయి. ఇతర భాషల్లో కూడా అనువదిస్తున్నారట. ఇప్పటి వరకు బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ ఖ్యాతి దొరికంది. ఇప్పుడు పాటకూ అంతే స్థాయి లభించి.. అందరి నోళ్లలో.. అన్ని భాషల్లో మార్మోగనున్నది.