అతను బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కొడుకు. ముంబయిలో ఓ రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( NCB) దాడిచేసి పలువురిని అరెస్టు చేసింది. ఇందులో షారూఖ్ ఖాన్ కొడుకు ఉన్నాడు. విచారణ జరుపుతున్న సమయంలోనే ఓ ఎన్సీబీ ఆఫీసర్ అతని కొడుకుతో ఓ సెల్ఫీ తీసుకున్నాడు. తీసుకోవడమే కాదు… దాన్ని ఏకంగా ఏదో ఇద్దరూ ఘనకార్యం చేసినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది బయట ప్రపంచానికి తెలిసింది. ఇంకే ముంది..? ఆడుకుంటున్నారు ఈ ఎన్‌సీబీ ఆఫీసర్‌తో.
అతను పెద్ద ఘనకార్యం చేసినట్టు సెల్ఫీ తీసుకుంటావా? అసలు నీకు సిగ్గుందా? అని ఏకిపాడేస్తున్నారు. ఇదిప్పుడు వైరల్‌గా మారింది. చేయాల్సిన డ్యూటీ చేయకుండా సొంత పైత్యం..అభిమానం అని వెంపర్లాడితే ఇదిగో ఇలాగే ఉంటుంది వ్యవహారం. ఉన్న పరువు పోతుంది. మర్యాద మంటగలుస్తుంది. ఉద్యోగం ఊడుతుంది. ఈ సెలబ్రిటీలతో సెల్ఫీల పిచ్చి జనాల్లో ఓ పీక్‌లో ఉంటుంది. ఆ మధ్య నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోతే .. నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్‌లో కొందరు నర్సులు ఆయన డెడ్‌బాడీతో పల్లికిలిస్తూ సెల్ఫీలు దిగారు. ఈ విషయం బయటకు తెలిసింది. పరువు పోయింది. వారి ఉద్యోగాలు ఊడాయి.