టాటా గ్రూప్ ప్రారంభ‌మై ఇప్ప‌టికే 153 సంవ‌త్స‌రాల‌వుతోంది. కాని ఈ మ‌ధ్య టాటా గ్రూప్ 150వ యానివ‌ర్స‌రీ అంటూ మెసేజ్‌లు వ‌స్తున్నాయి. ఈ మెసేజ్‌ను క్లిక్ చేస్తే అందులో వ‌చ్చే స‌ర్వేను పూర్తి చేస్తే మీకు నెక్షాన్ ఎల‌క్ట్రిక్ వెహికిల్ గెలుచుకోవ‌చ్చ‌ని దీని సారాంశం. కాని ఇది క్లిక్ చేసి స‌ర్వే పూర్తి చేయ‌గానే మ‌రో 10 మందికి దీనికి ఫార్వ‌ర్డ్ చేయండ‌ని మెసేజ్ వ‌స్తుంది. ఇందులోనే మోసం ఉంది.

ఒక‌రు ప‌ది మందికి దీనికి ఫార్వ‌ర్డ్ చేయ‌డం వ‌ల్ల ఎవ‌రైతే దీనిని సృష్టించిన సైబ‌ర్ నేర‌గాడికి మ‌న బంధువుల‌, మ‌న మిత్రుల‌, మ‌న తోటి ఉద్యోగుల డేటాను అందించినవారిగా మిగిలిపోతాం. అందుకే మీరు బ‌హుమ‌తి గెలుచుకుంటారు అని మెసేజ్ వ‌స్తే అది మోసం అని తెలుసుకోండి. ఊరికే బ‌హుమ‌తులు ఎవ‌రూ ఇవ్వ‌రు. మ‌న అమాయ‌క‌త్వమే వారికి మంచి ఆదాయంగా మ‌రుతోంది. ఇప్ప‌టికైనా మారండి.మెసేజ్‌లు ఫార్వ‌ర్డ్ చేయ‌డం మానండి. ఇప్ప‌టికే అమెజాన్ యానివ‌ర్స‌రీ, ఫ్లిఫ్‌కార్ట్ యానివ‌ర్స‌రీ, రిల‌య‌న్స్ యానివ‌ర్స‌రీ అంటూ ప్ర‌ముఖ కంపెనీల పేరుతో బ‌హుమ‌తుల ఉచ్చులో మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న డేటాను దొంగిలిస్తున్నారు. అప్ర‌మ‌త్తంగా ఉండండి. సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు చిక్క‌కండి..

You missed