2012లో.. సరిగ్గా ఇదే రోజు తెలంగాణ మలిదశ ఉద్యమంలో సాగరహారమనే ఒక శాంతియుత ఉద్యమరూపం కీలక ఘట్టం పోషించింది. మిలియన్ మార్చ్ ఏ విధంగానైతే ఉద్యమాన్ని ఢిల్లీ పీఠానికి సెగతగిలేలా చేసిందో సాగరహారం శాంతి యుతంగా ఒక నిరసన జ్వాలను, ఆత్మగౌరవ ఆకాంక్షను ఢిల్లీ పెద్దలకు తెలియజేసింది. అయితే టీఆరెస్ శ్రేణులు కొంత మంది సోషల్ మీడియా సాగరహార ఉద్యమ నేపథ్యాన్ని తీసుకుని అందులో బండి సంజయ్, రేవంత్ రెడ్డి పాత్రల గురించి వెటకారంగా, వ్యంగ్యాంగా పోస్టు చేస్తున్నారు.
‘సుధీర్ కుమార్ తాండ్రా’ టీఆరెస్ సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉండే వ్యక్తి. అతను సాగరహారం ఫొటోను పై వ్యూవ్ నుంచి తీసుకుని ఇందులో లెప్ట్‌సైడ్ 210వ వ్యక్తి బండి సంజయ్ అని, అదే వరుసలో 420వ వ్యక్తి రేవంత్ రెడ్డి అని పోస్ట్ చేశాడు. సెటైర్ మామూలుగా లేదు. అద్ధిరిపోయింది. దీని మినీంగ్ ఏమిటంటే మలిదశ ఉద్యమం పతాకాస్థాయికి చేరుకున్న సందర్భాల్లో, కీలకఘట్టాల్లో, ఉద్యమ రూపాల్లో వీరు లేరని చెప్పడం ఉద్దేశం. బాగానే ఉంది. కానీ ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఉద్యమ నేపథ్యం లేనివాళ్లే. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఇప్పుడు ఉద్యమం గురించి మాట్లాడకపోవడం బెటరేమో. ఎందుకంటే ఒక వేలు అటువైపు చూపిస్తే మిగిలిన వేళ్లు మనవైపు చూపిస్తున్నట్లే.