మన విలేకరులు ఈ నోరు తిరగని, అర్థం తెలియని పదాలెందుకు వాడతారో తెలియదు. అవి వాడితే తప్ప పెద్ద జర్నలిస్టు అనుకోరనుకుంటారో..? జర్నలిస్టు అంటే అలాంటి అర్థంకాని, నోరు తిరగని పదాలే వాడాలని అనుకున్నారో తెలియదు కానీ ఇలా నవ్వుల పాలవుతూ ఉంటారు. మొన్న వర్షాన్ని టీవీ9 రుధిరం చేసేసింది. ఇప్పుడు అదే వర్షం భానుడి రూపంలో వచ్చి నిండా తడిపేసి, ముంచేసి.. కొట్టుకుపోయేలా చేసింది. ఓ జర్నలిస్టు మిత్రుడు ఒకసారి చరవాణి అన్నాడు సెల్‌ఫోన్‌ను. సెల్‌ఫోన్ అనచ్చు కదా అని నేనన్నా. ఏం అన్లేదు. ఈనాడు పత్రిక ఏ భాష వాడితే అదే మనం వాడాలి.. లేదంటే మనల్ని విలేకరులనుకోరని డిసైడ్ అయినట్టున్నారు కొందరు. ఇదీ అలాగే ఉంది. భానుడికి, వరుణుడికి, రుధిరానికి, మేఘాలకు, వర్షాలకు తేడాలు తెలియకుండా అలా చెప్పేస్తూ ఉంటారు. బక్రాలవుతూ ఉంటారు. మనం కాసేపు నవ్వుకోవాలంతే. నేటి జర్నలిజం పోకడలు చూసి.