డీఎస్‌కు టైం క‌లిసిరావ‌డం లేదు. అదేదో ఖ‌ర్మ కాక‌పోతే .. ఆయ‌న పుట్టిన రోజునా ఆయ‌న‌కు బాధ‌లు త‌ప్ప‌లేదు. ఇంట్లో కాలుజారి ప‌డ్డాడ‌ని, చేతికి దెబ్బ త‌గిలింద‌ని అర్వింద్ త‌న ఫేస్‌బుక్కు వాల్‌పై బాధ‌ను పంచుకున్నాడు. ఇంకా ప‌రీక్ష‌లు చేయించాల్సి ఉంద‌ని కూడా చెప్పాడు. అస‌లే అజ్ఞాతంలో ఉన్నాడు. ఎవ‌రినీ క‌ల‌వ‌డం లేదు. పుట్టిన రోజున ఎవ‌రైనా శుభాకాంక్ష‌లు చెబుతామ‌న్నా.. ఫోన్ స్విచ్చాఫ్ పెట్టేసుకున్నాడ‌ట ఈ బాధ‌లో. ఏం మాట్లాడాలో తెలియ‌క‌. మంచి రోజులు ఎప్పుడొస్తాయో తెల్వ‌దు కానీ.. ఇప్ప‌టికైతే అన్నీ గ‌డ్డు రోజులే న‌డుస్తున్నాయి డీఎస్‌కు.

You missed