ఆంధ్రలో సినీ పరిశ్రమ మొత్తం సీఎం జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఎందుకొచ్చిన గొడవని అంతా జగన్‌ను బతిమాలుకుంటున్నారు. చిరంజీవి నుంచి మొదలుకొని నాని దాకా. ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలు ప్రభుత్వమే చూసుకోవడం, బెనిఫిట్ షోలు లేకుండా చేయడం.. రేట్లను తగ్గించి ఒకే రేట్లను అమలు చేయడం.. ఇవన్నీ అక్కడ ఇండస్ట్రీకి పెద్ద నష్టాన్నే కలిగిస్తున్నాయి. ఏమనాలో తెలియక, ఏమన్నా అంటే మొదటికే మోసం వస్తుందనే భయంతో సీనీ పెద్దలంతా, నిర్మాతలంతా ఆచితూచి మాట్లాడుతున్నారు.
ఏపీ సర్కార్‌తో జాగ్రత్తగా డీల్ చే్స్తున్నారు. అన్నీచక్కదిద్దుకుంటాయని భావిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బ…. సినీ ఇండస్ట్రీని మరింత అగాధంలోకి పడేసింది. సాయిధరమ్ తేజ్ .. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ ప్రసంగం జగన్‌ను రెచ్చగొట్టి.. సమస్యను మరింత జఠిలం చేసేలా ఉంది. ఆఖరికి అన్న చిరంజీవిని కూడా వదల్లేదు. ఎందుకు జగన్‌ను బతిమాలుతున్నారు..? ప్రశ్నించండి. నిలదీయండి. ఖండించండి. అని హితబోధ చేశాడు. తనపై కోపం ఉంటే ..తన సినిమాలపై ప్రతాపాన్నిచూపాలని, మా వాళ్లను వదిలెయ్ అంటూ జగన్‌ను మరింత రెచ్చగొట్టి కయ్యానికి కాలు దువ్వాడు.
ఈ మాటలకు సనీ పెద్దలంతా నోరెళ్లబెట్టారు. ఇది ఇప్పట్లో ఇకతేలదని, జగన్ మరింత మొండిపట్టు పట్టి కూర్చుంటాడని ఫిక్స్ అయిపోయారు. కొండ నాలుకకు మందేస్తే.. ఉన్ననాలిక ఊడిందన్నట్టుగా పవన్ మొత్తం చెడగొట్టేసాడని పరిశ్రమల పెద్దలు మండిపడుతున్నారు. పవన్ మాటలు .. అతని జనసేన పార్టీకి మైలేజీ ఇస్తాయేమో గానీ, సినీ పరిశ్రమ సమస్యను మాత్రం మరింత అగాధంలో పడేశాయని అభిప్రాయపడుతున్నారు.