తీన్మార్ మ‌ల్ల‌న్నను మ‌ళ్లీ అరెస్టు చేసి చంచ‌ల్ గూడ జైలుకు పంపారు నిజామాబాద్ పోలీసులు. మొన్న‌టి వ‌ర‌కు చంచ‌ల్‌గూడ జైలులో శిక్ష అనుభ‌విస్తున్న మ‌ల్ల‌న్న‌కు ఈ రోజు బెయిల్ వ‌చ్చింది. వెంట‌నే అప్ప‌టి వ‌ర‌కు కాపుకాసి ఉన్న నిజామాబాద్ పోలీసులు మ‌ల్ల‌న్న‌ను అరెస్టు చేసి బోధ‌న్‌కు తీసుకువ‌చ్చారు. ఇక్క‌డ మేజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌రిచారు. 14 రోజులు జ్యూడిషియ‌ల్ రిమాండ్ విధించారు. చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించారు. ఇది ముగిసే స‌రికి మ‌ళ్లీ ఒక కేసులో తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను జైలుకు పంపేందుకు పోలీసులు రెడీగా ఉన్నారు. ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చి అలా లోప‌లికి వెళ్ల‌డ‌మే ఉంటుంది. దాదాపు 30పైగా కేసులు పెట్టారు మ‌రి. పాద‌యాత్ర గురించి జ‌య‌వ‌ర్ధ‌న్ గౌడ్ అనే క‌ల్లు వ్యాపారి వ‌ద్ద 20 ల‌క్ష‌లు అడిగిన కేసులో మ‌ల్ల‌న్న‌ను ఇక్క‌డి పోలీసులు అరెస్టు చేశారు.

You missed