అడవిపందుల బెడద కోసం కరెంటు పెట్టాడో రైతు. రాత్రి వేళలో పెట్టి.. ఉదయమే తీసేయ్యాలి. తీసేస్తాడు. కానీ ఈ రోజు మరిచాడు. ఫలితంగా ఓ యువకుడు ప్రాణాలు బలయ్యాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలోని తిరుపెళ్లి గ్రామంలో ఇది జరిగింది. కొచ్చెర నారాయణ అనే రైతు అడవి పందులు పొలాన్ని నాశనం చేస్తున్నాయని కరెంటు పెట్టాడు. ఉదయం తీసేయలేదు. పక్క పొలానికి చెందిన భీమేష్ యాదవ్ అనే యువకుడు ఈ కరెంటు షాక్‌తో చనిపోయాడు. రైతు నిర్లక్ష్యంతోనే నిండు ప్రాణం బలికావడంతో .. పెద్దలు రాజీ కుదిర్చారు. 21 లక్షల పరిహారం ఆ మృతుడి కుటుంబానికి ఇవ్వాల్సిందిగా ఒప్పందం చేసుకున్నారు. ఓ 20వేలు పెట్టి సోలార్ ఫెన్సింగ్ వేస్తే పోయేదానికి ఇలా కరెంటు పెట్టడం వల్ల ఓ ప్రాణం పోయిందని, 21 లక్షల పరిహారం ఇవ్వాల్సి వచ్చిందని ఆ గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. వాస్తవంగా దీనిపై అటవీశాఖ అధికారులు అవగాహన కల్పించాలి. దీంతో ఈ కరెంటు పద్దతినే ఇంకా వాడుతున్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.