#ఇసుక …
చాలా మంది రోడ్డు మీద ఉన్న పిడికెడు ఇసుక గురించే మాట్లాడుతున్నారు.
కానీ ఈ ఇసుక మాటున మంట కలిసిన మానవ సంబంధాల గురించో..
దిగజారి పోయిన పాత్రికేయ విలువల గురించో
ఏ ఒక్కరు మాట్లాడ లేక పోతున్నారు.
ఒక చిన్నారిని కర్కశంగా రేప్ చేసి చంపితే పట్టించుకోని మీడియా..
ఒక సినిమా హీరో కు దెబ్బతగిలిందని మాత్రం విలవిల
లాడి పోతుంది.
వాళ్లకు కావాలిసింది రేటింగ్ ఒక్కటే..
అది ఎక్కడ వస్తే అక్కడ వాలిపోతారు.
రేటింగ్ రాడానికి బాత్ టబ్బుల్లో కూర్చోమన్నా కూర్చుంటారు.
వరద బొమ్మలేసుకొని కూర్చోమన్నా కూర్చుంటారు.
రేటింగ్ రాడానికి అవసరమైతే సమస్యను పెద్దగా చెయ్యడానికి
కూడా వెనకడుగు వెయ్యరు.
అయినా సినిమా వాళ్లకు మనం ఏనాడు అవసరం పడలేదు.
ఎందుకంటే సినిమా వాళ్ళను వ్యక్తిపూజ చేసే సంస్కృతి మన దగ్గర లేకపోవడమే ప్రధాన కారణం.
సినిమా వాళ్ళు కూడా వాళ్ళ ఆస్తులు హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉంటున్నారు కానీ ..
లేకపోతే ఎప్పుడో జెండా ఎత్తేసేవాళ్ళు
ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణా ఉద్యమంలో కూడా సినిమా వాళ్లు మన మనోభావల్ని గౌరవించిన దాఖలాలు లెవ్వు.
కాబట్టి..
మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే …
వాళ్ళు ఎప్పుడూ మన వాళ్ళు కాలేరని..
అయినప్పుడు …
ఆ బైక్ ధర ఎంత ఉంటే ఏంటి ..??
ఆ బైక్ ఎవరి పేరు మీద ఉంటే మనకు ఏంటి ..??
వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తే మనకు ఏంటి..??
మీరు ఇది తెలిస్తే షాక్ అవుతారు
అది తెలిస్తే షాక్ అవుతారు.
అంటే ఏది పట్టించుకోకండి.
మీరు ఎంత షాక్ అయితే వాళ్లకు అన్ని పైసలు వస్తాయి.
మీకు మాత్రం షాక్ లు మాత్రమే మిగులుతాయి.
సంవత్సరానికి ఒక్కో సినిమా తీస్తూ వాళ్ళు కోట్లు గడిస్తుంటే..
నీ జీవితం ఎక్కడా మొదలయ్యిందో అక్కడే ముగిసి పోతుంది తప్ప ఒక్క అడుగన్నా ముందుకు పడిందా …??
సినిమా మన జీవితంలో ఒక భాగం మాత్రమే.
సినిమానే మన జీవితం మాత్రం కాదు… ✍️✍️
Manjeera Srinivaas