సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత పరిణామాలు వార్తల్లొకెక్కుతున్నాయి. ఓవర్ స్పీడ్‌తో వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు సాయిధరమ్ తేజ్ పై కేసు బుక్ చేశారు. దీనిపై సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ స్పందించిన తీరు హాస్యాస్పదమైంది. అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు అక్కడ రోడ్డు పై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్స్ట్రక్షన్ కంపెనీ పైన… ఎప్పటికప్పుడు రోడ్డును క్లీన్‌గా ఉంచాల్సిన మున్సిపాలిటీ పై కూడా కేసు పెట్టాలని డిమాండ్ చేశాడు. దీని పై నెటిజన్లు ఆర్పీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
అసలు సమస్య ఓవర్ స్పీడ్ అయినప్పుడు అది వదిలేసి కోడుగుడ్డు మీద ఈకలు పీకినట్లు ఇతర కారణాలను తెర పైకి తెచ్చి మాట్లాడడాన్ని నెటిజన్లు తప్పుబట్టారు. వ్యంగ్యంగా ట్రోల్ చేస్తూ కామెంట్లు పెట్టారు. భారతీయుడు సినిమాలో కోర్టు సీన్‌ను దీనికి ఆపాదిస్తూ.. ఆర్పీ కామెంట్‌ను కామెడీ చేసేశారు.